The end of the TDP rule is the end. Call for VSIP leaders in Rachabanda, Palleninidra program

టీడీపీ పాలనకు అంతిమసమయం ఆసన్నమైంది

– నవరత్నాలకు నాంది పలుకుదాం.
-రచ్చబండ, పల్లెనిద్ర లో వైసీపీ నేతల పిలుపు
Date: 15/12/2017
పెద్దపంజాణి ముచ్చట్లు:
రాష్ట్రంలో ప్రస్తుతం అధికారంలో ఉన్న తెదేపా ప్రభుత్వ పాలనకు అంతిమసమయం ఆసన్నమైందని, వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రకటించిన నవరత్నాలకు నాంది పలకాలని ఆ పార్టీ నేతలు పిలుపునిచ్చారు. రాయలపేట పంచాయితీ చిలకపుత్తూరులో వైసీపీ రాష్ట్ర కార్యదర్శి, మాజీ ఎంపీపీ విజయభాస్కరరెడ్డి, మండల కన్వీనర్ బాగారెడ్డి ఆద్వర్యంలో రచ్చబండ, పల్లెనిద్ర కార్యక్రమం నిర్వహించారు. చంద్రబాబు హామీలు నమ్మి బ్యాంకు రుణాలు చెల్లించలేక అధిక వడ్డీ భారంతో అవస్థలు పడుతున్నామని స్థానికులు వాపోయారు. ఈ విషయంపై  నియోజకవర్గ సమన్వయ కర్తలు సీవీకుమార్,రాకేష్ రెడ్డి స్పందిస్తూ వైఎస్ జగన్ ప్రకటించిన నవరత్నాలతో అందరికీ న్యాయం జరుగుతుందన్నారు. రాష్ట్ర కార్యదర్శి విజయభాస్కరరెడ్డి మాట్లాడుతూ వైసీపీ అధికారంలోకి వచ్చాక అర్హులందరికీ ఇళ్ళు, రేషన్ కార్డులు, ఫించన్లు అందుతాయని చెప్పారు. జిల్లా కార్యదర్శులు చెంగారెడ్డి,తమ్మిరెడ్డి మాట్లాడుతూ రానున్న 2019 అసెంబ్లీ ఎన్నికలలో జగన్ ను సీఎం చేయడానికి అందరూ కృషి చేయాలని కోరారు.దళిత వాడ ల్లోని సమస్యలను గుర్తించి వాటి పరిష్కారానికి నిర్వహిస్తున్న రచ్చబండ, పల్లెనిద్ర కార్యక్రమానికి ప్రజలనుంచి మంచి స్పందన లభిస్తోందన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా మైనారిటీ సెల్ కార్యదర్శి సుహేబ్,పలమనేరు పట్టణ కన్వీనర్‌ మండీ సుధ, జిల్లా కార్యదర్శులు రవి, శశిధర్, సిగిల్ విండో అధ్యక్షుడు శంకరప్ప, రహంతుల్లా, మాజీ జడ్పీటీసీ రెడ్డెప్ప, యరబల్లి శ్రీనివాసులు, మోహన్ రెడ్డి, రంజిత్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Tag: The end of the TDP rule is the end. Call for VSIP leaders in Rachabanda, Palleninidra program

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *