Natyam ad

పుంగనూరులో పర్యావరణాన్ని పరిరక్షించాలి

పుంగనూరు ముచ్చట్లు:
 
పర్యావరణ కాలుష్యాన్ని నివారించేందుకు ప్రతి ఒక్కరు మొక్కలు నాటాలని రాష్ట్ర జానపద కళల సంస్థ చైర్మన్‌ కొండవీటి నాగభూషణం తెలిపారు. ఆదివారం రాగానిపల్లె రోడ్డులో మొక్కలు నాటే కార్యక్రమాన్ని మున్సిపల్‌ చైర్మన్‌ అలీమ్‌బాషాతో కలసి ప్రారంభించారు. నాగభూషణం మాట్లాడుతూ మున్సిపాలిటి పరిధిలో సుమారు ముప్పెవేల మొక్కలు నాటి, మున్సిపాలిటి ద్వారా సంరక్షిస్తున్నట్లు తెలిపారు. ట్రీగార్డులు ఏర్పాటు, ట్యాంకర్ల ద్వారా నీటి సరఫరా చేపట్టామన్నారు. అలాగే ప్రతి ఒక్కరి ఇంటి వద్ద మొక్కలు నాటి పోషించి, హరిత పుంగనూరుగా మార్చేందుకు ప్రతి ఒక్కరు సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో కమిషనర్‌ రసూల్‌ఖాన్‌, వైస్‌ చైర్మన్‌ నాగేంద్ర, కౌన్సిలర్లు కొండవీటి కాంతమ్మ, మమత తదితరులు పాల్గొన్నారు.
 
Tags; The environment in Punganur should be protected