ఆర్థిక సంవత్సరం అంచనా బడ్జెట్ 113 కోట్ల రూపాయలు

-నంద్యాల పురపాలక చైర్మన్  షేక్ మాబున్నిషా
నంద్యాల ముచ్చట్లు:
 
ఈ ఆర్థిక సంవత్సరం అంచనా బడ్జెట్ 113 కోట్ల రూపాయలు అని నంద్యాల పురపాలక  చైర్మన్  షేక్ మాబున్నిషా అన్నారు.శుక్రవారం నంద్యాల మునిసిపల్   కౌన్సిల్ సమీక్ష సమావేశ భవనంలో  నంద్యాల పురపాలక సంఘ చైర్మన్. షేక్ మాబున్నిషా.  మున్సిపల్ కౌన్సిల్ బడ్జెట్ సమావేశం నిర్వహించారు.
సమీక్షా సమావేశంలో నంద్యాల పురపాలక సంఘ వైస్ చైర్మన్ . పాంషావలి . మున్సిపల్ కమిషనర్ వెంకటకృష్ణ .మున్సిపల్ అసిస్టెంట్ కమిషనర్ వెంకట దాస్.  మున్సిపల్ ఇంజనీర్ రమణ.  డిఈ. మదు కుమార్ . మున్సిపల్ కార్యాలయ సిబ్బంది మున్సిపల్ కోఆప్షన్ మెంబర్లు మున్సిపల్ కౌన్సిలర్లు పాల్గొన్నారు.
నంద్యాల పురపాలక సంఘ చైర్మన్  షేక్ మాబునిషా మాట్లాడుతూ  గత ఆర్థిక సంవత్సరంలో పురపాలక సంఘం లో59 కోట్ల రూపాయలు మిగులు బడ్జెట్ గా ఉందని అన్నారు. 2021-22 సంవత్సరమునకు సవరించబడిన బడ్జెట్ అంచనాలు మరియు2022-23 ఆర్థిక సంవత్సరపు బడ్జెట్ అంచనాల కు సంబంధించి  కౌన్సిల్ ఆమోదం కొరకు శుక్రవారం నాడు సమావేశం నిర్వహించడం జరిగిందన్నారు.
మున్సిపల్ కమిషనర్ వెంకట కృష్ణ మాట్లాడుతూ నంద్యాల పురపాలక సంఘం లో ఆర్థిక సంవత్సరానికి గాను 59 కోట్ల మిగులు బడ్జెట్ ఉందని తెలిపారు. మన మున్సిపాలిటీకి రెవెన్యూ ఆదాయం గా దాదాపు37.43  కోట్ల రూపాయలు రావొచ్చని  క్యాపిటల్ రెవెన్యూ గా దాదాపు17.30  కోట్ల రూపాయలు రావచ్చని అంచనావుందన్నారు. రెవిన్యూ ఆదాయం మరియు ఖర్చులు ప్రతి అంశం పైన కౌన్సిల్ తెలియజేయడం కొరకు మరియు ఆమోదం కొరకు సమావేశం నిర్వహించుకున్నామన్నారు .
 
 
ఈ బడ్జెట్ అంచనాలు గురించి కౌన్సిల్ సమావేశంలో గౌరవ కౌన్సిల్ సభ్యులు అందరికీ క్షుణ్ణంగా వివరించామన్నారు.ఈరోజు జరిగిన సమావేశం నందు అజండా లోని  అంశాలన్నిటికీ ఆమోదముద్ర  వేయడం జరిగిందని తెలిపారు .శుక్రవారం జరిగిన సమావేశంలో కొంతమంది  కౌన్సిలర్లు . దేశం సులోచన. అబ్దుల్ . కో ఆప్షన్ మెంబర్. సుబ్రమణ్యం.  తదితరులు  మాట్లాడుతూ   మన నంద్యాల పట్టణంలో . మురుగు కాల్వలు. రోడ్ల కొరకు కేటాయించే బడ్జెట్లో కొద్దిగా పెంచుకుంటే బాగుంటుందన్నారు.కౌన్సిలర్ శ్యామ్ సుందర్ లాల్  మాట్లాడుతూ  నంద్యాల పట్టణాన్ని జిల్లాగా ఏర్పాటు చేస్తున్నందుకు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు వైయస్ జగన్మోహన్ రెడ్డి గారికి హృదయపూర్వక కృతజ్ఞతలు అన్నారు. నంద్యాల పట్టణం లోని  రోడ్ల కు మరియు డ్రైనేజీలు కొరకు కేటాయించిన బడ్జెట్ లో అన్ని వార్డులకు సమానంగా కాకుండా  అత్యవసరమైన వార్డులలో ఎక్కువ బడ్జెట్ ను కేటాయిస్తే బాగుంటుందని అభిప్రాయాన్ని కౌన్సిల్ కి తెలియజేశారు. ఇంకా కొంత మంది కౌన్సిలర్లు మాట్లాడుతూ నంద్యాల పురపాలక సంఘం లో పారిశుద్ధ్య కార్మికులను ఇంకా అధిక సంఖ్యలో ఏర్పాటు చేయాలని కోరారు. పట్టణంలో ఉదయం .సాయంకాల.సమయంలో ఫాగింగ్  చేయించాలని కోరినారు. నంద్యాల పట్టణంలో ని  జనాభాను దృష్టిలో ఉంచుకొని  రోడ్లను విస్తరింప చేయాలని  పట్టణ ప్రణాళిక వారి ద్వారా దురాక్రమణకు గురైనటువంటి రోడ్లను విస్తరింప చేయాలన్నారు.  నంద్యాల పట్టణంలోని ఎన్జీవోస్ కాలనీ నందు జనాభా పెరుగుతున్నందున రోడ్ల విస్తరణ కార్యక్రమం మా వార్డులో  అత్యవసర మన్నారు కుక్కల బెడద   ఉందని  మా వార్డులో  మెయిన్ రోడ్డు లో ఉన్న  మోరీల దగ్గర  మురుగునీరు ఉన్నదని సిల్క్ తీయించి వాటిని శుభ్ర పరచాలి అని కోరినారు మా వార్డు నుంచి రోడ్ల  విస్తరణ మొదలు చేయాలని వార్డు కౌన్సిలర్  దేశము  సులోచన కోరారు.
 
Tags: The estimated budget for the financial year is Rs 113 crore

Natyam ad