The farmers' anxiety before Adityanath's house

ఆదిత్యనాథ్ ఇంటి ముందు రైతుల ఆందోళన

Date: 07/01/2018

ఉత్తరప్రదేశ్ ముచ్చట్లు:

బంగాళాదుంపలకు ప్రభుత్వం మద్దతు ధర కల్పించాలని ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ ఇంటి ముందు రైతులు ఆందోళన చేపట్టారు. సీఎం ఇంటి బయట బంగాళదుంపలు పోసి నిరసనను తెలిపారు. బంగాళదుంపలు పండించే రైతులు క్వింటాల్‌ రూ.1,000 చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అయితే ప్రభుత్వం మాత్రం రూ.487 రూపాయల ధరను ఖరారు చేసింది. దీంతో రైతులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఒక గ్రూపుగా వెళ్లి.. సీఎం ఇంటి భద్రతా అధికారుల కళ్లుగప్పి ఇంటి బయట బంగాళదుంపలు కుప్పలుగా పోసి తమ నిరసనను వ్యక్తం చేశారు. ఈ ఘటనకు పోలీసుల నిర్లక్ష్యమే కారణమంటూ ఎస్‌ఐతో పాటు మరో నలుగురు కానిస్టేబుల్స్‌ను సస్పెండ్ చేస్తూ అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు.

Tags : The farmers’ anxiety before Adityanath’s house

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *