లక్నోకు తొలి మహిళా మేయర్

లక్నో ముచ్చట్లు:
ఇదో కొత్త చరిత్ర. లక్నో మేయర్గా ఓ మహిళ ఎన్నికైంది. బీజేపీకి చెందిన సన్యుక్త భాటియా ఇప్పుడు లక్నో మేయర్ కానున్నారు. గత వందేళ్లలో ఆ నగరానికి ఓ మహిళ మేయర్ రావడం ఇదే తొలిసారి. ఈ సారి లక్నో మేయర్ సీటును మహిళలకు రిజర్వ్ చేశారు. కాంగ్రెస్ తరపున ప్రేమా అవస్తీ, ఎస్పీ తరపున మీరా వర్దాన్ పోటీ చేశారు. సన్యుక్త భాటియా భర్త రెండు సార్లు లక్నో కంటోన్మెంట్ నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. ఆమె 1980 నుంచి బీజేపీలో సభ్యురాలిగా ఉన్నారు. నగరంలో ఉన్న 110 వార్డుల్లో బీజేపీ మొత్తం 44 సీట్లు గెలుచుకున్నది. 1916లో యూపీ మున్సిపాల్టీ చట్టం అమలులోకి వచ్చింది. ఆ తర్వాత మొదటిసారి ఆ నగరానికి ఓ మహిళ మేయర్గా బాధ్యతలు స్వీకరించనున్నారు.యూపీ రాష్ర్టానికి తొలిసారి సరోజినాయుడు మహిళా గవర్నర్గా నియమితులైన రికార్డు కూడా ఉన్నది. ఆమె 1947 నుంచి 1949 వరకు ఆ బాధ్యతలు నిర్వర్తించారు. ఆ తర్వాత దేశంలో తొలి మహిళా సీఎం కూడా యూపీ నుంచి ఎన్నికయ్యారు. మహిళా సీఎంగా సుచేత క్రిపలాని పనిచేశారు.తాజాగా కీలకమైన కాన్పూర్తో పాటు సీతాపూర్, బారాబంకి మున్సిపాల్టీల్లోనూ బీజేపీ హవా కొనసాగించింది.
Tag : The first woman mayor of Lucknow


Leave a Reply

Your email address will not be published. Required fields are marked *