The former sarpanches should continue in public service - MLA Peddireddy

మాజీ సర్పంచ్‌లు ప్రజల సేవలో కొనసాగాలి – ఎమ్మెల్యే పెద్దిరెడ్డి

Date:12/08/2018

పుంగనూరుముచ్చట్లు:

మాజీ సర్పంచ్‌లు ప్రతి ఒక్కరు సర్పంచ్‌లాగానే పని చేస్తూ, ప్రజా సేవలో కొనసాగాలని ఎమ్మెల్యే డాక్టర్‌ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కోరారు. ఆదివారం ఎంపీడీవో లక్ష్మిపతినాయుడు , ఎంపిపి నరసింహులు , జెడ్పిటిసి వెంకటరెడ్డి యాదవ్‌ ఆధ్వర్యంలో మాజీలైన సర్పంచ్‌లకు సన్మానము, ఆత్మీయ సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చేతులు మీదుగా వైఎస్సాఆర్సీపి, తెలుగుదేశం పార్టీ సర్పంచ్‌లకు శాలువలు కప్పి , పూలమాలలతో సత్కరించి, మెమెంటోలు అందజేశారు. ఈ సభలో ఎమ్మెల్యే పెద్దిరెడ్డి మాట్లాడుతూ సర్పంచ్‌ల పదవికాలాన్ని ప్రభుత్వం పొడిగించకుండ , ప్రత్యేక అధికారులను నియమించడం బాధకరమన్నారు. సర్పంచ్‌ లకు ఎన్నికలు నిర్వహించే దమ్ము , ప్రభుత్వానికి లేదని ఎద్దెవా చేశారు. ఎప్పుడు ఎన్నికలు నిర్వహించినా తెలుగుదేశం పార్టీ ఓటమి తప్పదని , అందుచేతనే ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఎన్నికలు నిర్వహించకుండ దాట వేస్తున్నారన్నారు. మాజీలైన సర్పంచ్‌లు ప్రతి ఒక్కరు పనిచేస్తూ, ప్రజల సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించాలన్నారు. సర్పంచ్‌లుగా పని చేసిన వారందరికి వారి పనితీరును బట్టి, రిజర్వేషన్లు బట్టి అవకాశాలు కల్పిస్తామని హామి ఇచ్చారు. ఎవరు నిరుత్సాహ పడవద్దని సూచించారు. పుంగనూరు నియోజకవర్గంలో 97 మంది సర్పంచ్‌లు వైఎస్సాఆర్సీపికి చెందిన వారని, సర్పంచ్‌లు సేవలు పార్టీ ఎన్నడు విస్మరించదని స్పష్టం చేశారు. ఎంపిపి నరసింహులు, జెడ్పిటిసి వెంకటరెడ్డి యాదవ్‌ మాట్లాడుతూ సర్పంచ్‌లు అధికభాగం వైఎస్సాఆర్సీపికి చెందిన వారని, నిజాయితీగా పని చేయడంతో తెలుగుదేశం ప్రభుత్వం వేదింపులు ఇక్కడ సాగలేదని తెలిపారు. ఈ సమావేశంలో మండల ఉపాధ్యక్షుడు రామచంద్రారెడ్డి, వైఎస్సాఆర్సీపి రాష్ట్ర కార్యదర్శులు పోకల అశోక్‌కుమార్‌, రెడ్డెప్ప, కొండవీటి నాగభూషణం, జిల్లా అధికార ప్రతినిధి నాగరాజారెడ్డి, వైఎస్సాఆర్‌ ఆర్టీసి మజ్ధూర్‌ జిల్లా అధ్యక్షుడు జయరామిరెడ్డి, మున్సిపల్‌ ఉద్యోగ కార్మిక సంఘ అధ్యక్షుడు ఫకృద్ధిన్‌షరీఫ్‌, మున్సిపల్‌ వైస్‌ చైర్మన్‌ అమరేంద్ర, కౌన్సిలర్లు అమ్ము, మనోహర్‌, చౌడేపల్లె ఎంపిపి అంజిబాబు, ఏపీవో సుట్లూరు శ్రీనివాసులుతో పాటు పలువురు ఎంపీటీసీలు పాల్గొన్నారు.

దేవేంద్రాచారి మృతికి మంత్రి నివాళి

Tags:The former sarpanches should continue in public service – MLA Peddireddy

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *