టిటిడి క్రీడాపోటీల్లో ప్ర‌త్యేక ప్ర‌తిభావంతుల ప్ర‌తిభ

తిరుపతి ముచ్చట్లు:
 
టిటిడి ఉద్యోగుల క్రీడలు గురువారం తిరుపతిలోని టిటిడి ప‌రిపాల‌నా భ‌వ‌నంలో గ‌ల‌ పరేడ్‌ మైదానం, ఎస్వీ ఆర్ట్స్ క‌ళాశాల మైదానంలో హోరాహోరీగా జరిగాయి. ఇందులో ప‌లువురు ప్ర‌త్యేక ప్ర‌తిభావంతులైన ఉద్యోగులు ప్ర‌తిభ క‌న‌బ‌రిచారు.
చెస్‌
– బదిర పురుష‌ ఉద్యోగుల పోటీల్లో  చంద్రశేఖర్ విజయం సాధించగా, నాగార్జున రన్నరప్‌గా నిలిచారు.
– పాక్షికంగా అంధులైన‌ ఉద్యోగుల పోటీల్లో  బాబు విజయం సాధించగా,  లక్ష్మీపతి రన్నరప్‌గా నిలిచారు.
క్యారమ్స్
– ప్ర‌త్యేక ప్ర‌తిభావంతులైన మహిళా ఉద్యోగుల పోటీల్లో  ప్రియాంక విజయం సాధించగా, విజయలక్ష్మి రన్నరప్‌గా నిలిచారు. క్యార‌మ్స్ డ‌బుల్స్‌ పోటీల్లో  తులసీ,  మాధవి జ‌ట్టు గెలుపొంద‌గా,  అమ్ములు , గంగోజమ్మ జ‌ట్టు ర‌న్న‌ర‌ప్‌గా నిలిచింది. ప్ర‌త్యేక ప్ర‌తిభావంతులైన పురుష‌ ఉద్యోగుల పోటీల్లో భాస్కర్ విజయం సాధించగా,  రెడ్డప్ప రన్నరప్‌గా నిలిచారు. క్యార‌మ్స్ డ‌బుల్స్‌ పోటీల్లో  రెడ్డప్ప,  విద్యాసాగర్ రెడ్డి జ‌ట్టు గెలుపొంద‌గా,  భాస్కర్ ,  సత్య జ‌ట్టు ర‌న్న‌ర‌ప్‌గా నిలిచింది. 45 ఏళ్ల లోపు పురుష‌ ఉద్యోగుల క్యార‌మ్స్ డ‌బుల్స్‌ పోటీల్లో  రమేష్ బాబు,  రమేష్ జ‌ట్టు విజయం సాధించగా,  శంకర్ కుమార్,  లక్ష్మీ పతి జ‌ట్టు రన్నరప్‌గా నిలిచింది.
డాడ్జి బాల్‌
– 45 ఏళ్ల లోపు మ‌హిళా ఉద్యోగుల పోటీలలో  లక్ష్మీదేవి జ‌ట్టు విజయం సాధించగా,  సునంద జ‌ట్టు రన్నరప్‌గా నిలిచింది.
 
Tags; The genius of the unique talents in TTD sports

Natyam ad