టిటిడి క్రీడాపోటీల్లో ప్ర‌త్యేక ప్ర‌తిభావంతుల ప్ర‌తిభ

తిరుపతి ముచ్చట్లు:
 
 
టిటిడి ఉద్యోగుల క్రీడలు మంగ‌ళ‌వారం తిరుపతిలోని టిటిడి ప‌రిపాల‌నా భ‌వ‌నంలో గ‌ల‌ పరేడ్‌ మైదానం, ఎస్వీ ఆర్ట్స్ క‌ళాశాల మైదానంలో హోరాహోరీగా జరిగాయి. ఇందులో ప‌లువురు ప్ర‌త్యేక ప్ర‌తిభావంతులైన ఉద్యోగులు ప్ర‌తిభ క‌న‌బ‌రిచారు.
చెస్‌
– ప్ర‌త్యేక ప్ర‌తిభావంతులైన‌ మ‌హిళా ఉద్యోగుల పోటీల్లో  బి.అరుణ‌కుమారి విజయం సాధించగా,   ఎం.విజ‌య‌ల‌క్ష్మి రన్నరప్‌గా నిలిచారు.
– ప్ర‌త్యేక ప్ర‌తిభావంతులైన పురుష‌ ఉద్యోగుల పోటీల్లో  కె.ర‌వికుమార్‌ విజయం సాధించగా, ఎంవిఎస్‌.సత్యం రన్నరప్‌గా నిలిచారు.
– పాక్షికంగా అంధులైన‌ ఉద్యోగుల పోటీల్లో  సి.రెడ్డెప్ప‌రెడ్డి విజయం సాధించగా, ఎస్‌.బ‌యారెడ్డి రన్నరప్‌గా నిలిచారు.
పాసింగ్ ది ల‌గేజ్‌
– 45 ఏళ్ల‌లోపు మ‌హిళా ఉద్యోగుల పోటీలలో   జి.చిన్న‌మునెమ్మ జ‌ట్టు విజ‌యం సాధించగా,   వి.ర‌మాదేవి జ‌ట్టు రన్నరప్‌గా నిలిచింది.
డాడ్జి బాల్‌
– 45 ఏళ్లు పైబ‌డిన మ‌హిళా ఉద్యోగుల పోటీలలో శ్రీమ‌తి ఎం.శోభారాణి జ‌ట్టు విజయం సాధించగా,   ఎం.మునిల‌క్ష్మి జ‌ట్టు రన్నరప్‌గా నిలిచింది.
బాల్ బ్యాడ్మింట‌న్‌
– 45 ఏళ్ల‌లోపు ఉద్యోగుల పోటీలలో  చీర్ల కిర‌ణ్ జ‌ట్టు విజయం సాధించగా,  ఎ.ధ‌న‌శేఖ‌ర్ జ‌ట్టు రన్నరప్‌గా నిలిచింది.
– 45 ఏళ్లు పైబ‌డిన ఉద్యోగుల పోటీలలో  గోపాల‌కృష్ణారెడ్డి జ‌ట్టు విజయం సాధించగా,  ఎన్‌.చంద్ర‌శేఖ‌ర్‌ జ‌ట్టు రన్నరప్‌గా నిలిచింది.
లాన్ టెన్నిస్‌
– 45 ఏళ్ల‌లోపు ఉద్యోగుల సింగిల్స్‌ పోటీలలో  వై.వేణుగోపాల్ రెడ్డి విజయం సాధించగా,  ఆర్‌.తుల‌సీరామ్‌ రన్నరప్‌గా నిలిచారు.
– 45 ఏళ్ల‌లోపు ఉద్యోగుల డ‌బుల్స్‌ పోటీలలో  వై.వేణుగోపాల్ రెడ్డి,  ఎం.ర‌మేష్ జ‌ట్టు విజయం సాధించగా, జి.విజ‌య‌కుమార్ వ‌ర్మ‌,  ఆర్‌.తుల‌సీరామ్ జ‌ట్టు రన్నరప్‌గా నిలిచింది.
ఫుట్‌బాల్‌
– ఈ పోటీలలో  టి.సంతానం జ‌ట్టు విజయం సాధించగా,  ఓ.ఓబుల్‌రెడ్డి జ‌ట్టు రన్నరప్‌గా నిలిచింది.
 
Tags: The genius of the unique talents in TTD sports

Natyam ad