పుంగనూరులో వైభవంగా మసెమ్మ జాతర ముగింపు

పుంగనూరు ముచ్చట్లు:
 
పుంగనూరు మండలంలోని కురప్పల్లె గ్రామంలో వెలసిన మసెమ్మ జాతరకు వేలాది మంది తరలివచ్చి అమ్మవారికి వెహోక్కులు చెల్లించారు. రెండవ రోజైన గురువారం రాత్రి అమ్మవారిని గ్రామాల్లో వైభవంగా ఊరేగింపు నిర్వహించి, నిమజ్జనం చేశారు. వేకువజాము నుంచి అమ్మవారికి ప్రజలు చలిపిండి దీపాలు, పెరుగన్నంతో పాటు జంతుబలులు సమర్పించి, వెహోక్కులు చెల్లించుకున్నారు. ఈ సందర్భంగా కురప్పల్లె గ్రామం భక్తులతొ కిక్కిరిసిపోయింది. మేళతాలాలతో, భజలనలతో, కోలాటలు, నృత్యాలు, ప్రదర్శనలు, పిల్లనగ్రోవి కట్టల నడుమ అమ్మవారి పూజలను వైభవంగా నిర్వహించారు. ఎలాంటి అవాంచనీయ సంఘటనలు జరగకుండ సీఐ గంగిరెడ్డి్య ధ్వర్యంలో పోలీసులు బందోబస్తు నిర్వహించారు. 30 గ్రామాలకు చెందిన ప్రజలు , తమ స్నేహితులు, కుటుంబ సభ్యులతో కలసి విందు భోజనాలతో విలాసంగా గడిపారు.
 
Tags; The glorious end of the Masemma fair in Punganur

Natyam ad