వైభవంగా ప్రాచీన చర్చి తిరునాళ్ల

కలసపాడు ముచ్చట్లు:
కలసపాడులోని 130 ఏళ్లనాటి ప్రాచీన పరిపేతురు-పరిపౌలు చర్చి తిరునాళ్ల శనివారం నుంచి వైభవంగా ప్రారంభమైంది. జిల్లా నుంచే కాక ప్రకాశం, కర్నూలు, అనంతపురం తదితర జిల్లాలతో పాటు ఇతర రాష్ట్రాల నుంచి పెద్దసంఖ్యలో భక్తులు తరలివచ్చారు. ప్రాచీన చర్చిలో ప్రత్యేక ప్రార్థనలు చేసి మొక్కులు తీర్చుకున్నారు. తొలుత నంద్యాల డయాసిస్ బిషప్ పుష్పలలిత, పలువురు ప్రముఖులను రేగించారు. చర్చిలో దీపాల ఆరాధన, బీదలాజర్- ధనవంతుడుతో పాటు పలు సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. బద్వేల్ సీఐ రెడ్డప్ప ఆధ్వర్యంలో పోలీసులు సేవలందించారు. చర్చి డీనరీ ఛైర్మన్ జాకోబ్, కార్యదర్శి సుధానంద్ తదితరులు భక్తులకు సేవలందించారు.
Tag : The glory is the ancient church Thirunalla


Leave a Reply

Your email address will not be published. Required fields are marked *