ఉద్యోగుల జీతాలను తగ్గించే హక్కు ప్రభుత్వానికి ఉంది..

-తేల్చి చెప్పిన ఏపీ హైకోర్టు
 
విజయవాడ ముచ్చట్లు:
 
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పీఆర్సీని సవాల్ చేస్తూ.. ఉద్యోగులు హైకోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. ఈ పిటిషన్‌ను ఆంధ్రప్రదేశ్ హైకోర్టు సోమవారం విచారించింది. ఈ సందర్భంగా పీఆర్సీ దాఖలైన పిటిషన్ పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. జీతాలు పెంచే అధికారం, అలాగే తగ్గించాలి ప్రభుత్వాలకు ఉంటుందని ఏపీ హైకోర్టు.పీఆర్సీ పర్సంటేజ్‌లపై చాలెంజ్ చేసే హక్కు ఉద్యోగులకు లేదని తేల్చి చెప్పింది. మీకు ఎంత జీతం తగ్గిందో చెప్పండి అంటూ ప్రశ్నించింది. పూర్తి డేటా లేకుండా ఇలా పిటిషన్ వేస్తారని హైకోర్టు ప్రశ్నించింది. పీఆర్సీ నివేదిక బయటకు రాకపోతే ప్రభుత్వాన్ని సంప్రదించాలని హైకోర్టు సూచనలు చేసింది. ఉద్యోగులకు జీతాలు పెరిగాయని లెక్కలతో కోర్టుకు తెలిపారు ప్రభుత్వం తరఫున అడ్వొకేట్ జనరల్ ఉద్యోగులకు జీతాలు పెరిగాయి లెక్కలతో కోర్టు తెలిపిన ఏజీ.. ఉద్యోగులకు న్యాయం చేసే దిశగా ప్రయత్నిస్తామని స్పష్టం చేశారు.హెచ్ఆర్ఏ విభజన చట్టం ప్రకారం జరగలేదంటూ హైకోర్టు దృష్టికి పిటిషనర్ తరుఫున న్యాయవాది రవితేజ తెచ్చారు. అయితే ఈ ఆరోపణతో హైకోర్టు ఏకీభవించలేదు. పీఆర్సీ వల్ల జీతం పెరిగిందా? తగ్గిందా? అనేది చెప్పాలని కోర్టు అడిగింది. మీకు ఎంత జీతం తగ్గిందో చెప్పాలని… అంకెల్లో ఈ లెక్కలు అందజేయాలని వ్యాఖ్యానించింది. అసలు పూర్తి డేటా లేకుండా కోర్టుకు ఎలా వస్తారని న్యాయస్థానం ప్రశ్నించింది. మరోవైపు ప్రభుత్వం తరపున అడ్వొకేట్ జనరల్ తన వాదలను వినిపిస్తూ… ఉద్యోగుల గ్రాస్ శాలరీ పెరిగిందని కోర్టుకు తెలిపారు. దీనికి సంబంధించిన లెక్కలను అందించారు.మరోవైపు, పీఆర్సీ పిటిషన్ పై ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఇందుకు సంబంధించి పిటిషనర్ కృష్ణయ్యతో పాటు స్ట్రిరింగ్ కమిటీ సభ్యులను జడ్జి ముందుకు హాజరు కావాలని న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది. సమ్మె నోటీసు ఇచ్చిన 12 మంది కమిటీ సభ్యులు కూడా విచారణకు రావాలని కోర్టు సూచించింది.
దాడులను అరికట్టాలి
Tags: The government has the right to reduce the salaries of employees.

Natyam ad