ప్రభుత్వ ఆస్పత్రిలో కోవిడ్ రోగులకు మెరుగైన సేవలు అందించాలి

-ప్రత్యేక ఓపీ నిర్వహించాలి
-పడకలు, ఆక్సిజన్ సిద్ధంగా ఉంచాలి
-జ్వర సర్వే వేగంగా పూర్తి చేయాలి
-జిల్లా కలెక్టర్ ఆర్ వి కర్ణన్
కరీంనగర్ ముచ్చట్లు:
 
 
జిల్లా ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రిలో కోవిడ్ రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని, ప్రత్యేకంగా ఓపీ నిర్వహించాలని ఆక్సిజన్, పడకలు సిద్ధంగా ఉంచాలని జిల్లా కలెక్టర్ ఆర్ వి కర్ణన్ వైద్యాధికారులను
ఆదేశించారు.సోమవారం కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో కోవిడ్ నియంత్రణపై వైద్య అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ  సాధారణ రోగులకు, కోవిడ్
రోగులకు ప్రత్యేక విభాగాలు ఏర్పాటు చేసి  వైద్య సేవలు అందించాలని సూచించారు. జ్వరంతో  బాధపడుతున్న వారికి ర్యాపిడ్ పరీక్షలు నిర్వహించి కోవిద్ లక్షణాలు ఉంటే ఔషధాల కిట్లు  అందించాలని
అన్నారు. ఆక్సిజన్, వెంటిలేటర్లు, పడకలు సిద్ధంగా  ఉంచాలని సూచించారు. కోవిడ్ తో వచ్చే గర్భిణులకు ప్రసవాలు చేయాలని తెలిపారు. కోవిడ్ వ్యాప్తి చెందకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని
వైద్యాధికారు లను ఆదేశించారు. జిల్లాలో కోవిడ్ రెండవ డోస్ వ్యాక్సినేషన్ 98.7 శాతం పూర్తి అయిందని, మంగళవారం లోగా వంద శాతం పూర్తి చేయాలని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారిని
ఆదేశించారు. జ్వర సర్వే నిర్వహిస్తున్న 100 బృందాలు, ప్రతి బృందం ఇంటింటి సర్వే నిర్వహిస్తూ రెండవ డోస్ వ్యాక్సినేషన్ ను ఒక రోజులో  200 చొప్పున టార్గెట్ పూర్తిచేయాలని కలెక్టర్ ఆదేశించారు.
జిల్లాలోని మానకొండూర్, గంగాధర, గుమ్లాపూర్, రామడుగు, చల్లూరు, ఇల్లంతకుంట లో వ్యాక్సినేషన్ వేగవంతం చేయాలని వైద్యాధికారులను ఆదేశించారు. జిల్లా ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రి లో అవసరం
మేరకు ల్యాబ్ టెక్నీషియన్ లను నియమించి కోవిడ్ రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని ఆస్పత్రి సూపరింటెండెంట్ ను ఆదేశించారు.ఈ సమావేశంలో జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్
జువెరియ, జిల్లా ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రి సూపరింటెండెంట్ రత్నమాల, రెసిడెంట్ మెడికల్ ఆఫీసర్ జ్యోతి, వైద్య అధికారులు పాల్గొన్నారు.
దాడులను అరికట్టాలి
Tags: The government hospital should provide better services to Kovid patients

Natyam ad