గిరిజన యానాదులను ప్రభుత్వం ఆదుకోవాలి.

-ఆంధ్ర ప్రదేశ్ గిరిజన ప్రజా సమాఖ్య రాష్ట్ర అధ్యక్షుడు రాజు నాయక్ డిమాండ్
నంద్యాల ముచ్చట్లు:
దశాబ్దాల తరబడి సంచారజాతి యానాదులకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందివ్వడంలో అన్యాయం జరుగుతూనే ఉందని గిరిజన ప్రజా సమాఖ్య రాష్ట్ర అధ్యక్షుడు రాజు నాయక్ అన్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు వర్తింప చేయడానికి అత్యంత కీలకమైన యానాదుల (ఎస్టి) కుల ధ్రువీకరణ పత్రాలు జారీ చేయడంలో రెవెన్యూ అధికారులు తాత్సారం చేస్తుండడంతోనే ఈ పరిస్థితి నెలకొందని ధ్వజమెత్తారు.శుక్రవారం నంద్యాల సమీపంలోని యానాదులు నివాసం ఉంటున్న స్థలం వద్దకు వెళ్లి రాజు నాయక్, రవి నాయక్ జిల్లా అధ్యక్షుడు బాలు నాయక్, మల్లేష్ నాయక్ వారి బృందం ప్రస్తుత స్థితిగతులను అడిగి తెలుసుకున్నారు గత కొంతకాలంగా 40 కుటుంబాలు ఇక్కడే తాత్కాలికంగా గుడిసెలు వేసుకొని నివాసం ఉంటున్నామని అయితే కొందరు తమ వద్దకు వచ్చి గుడిసెలను ఖాళీ చేయాలని బెదిరిస్తున్నట్లు సంచార కుటుంబాలు గిరిజన ప్రజా సమాఖ్య నేతలతో వాపోయారు. ఈ విషయంపై రాజు నాయక్ స్థానిక ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లారు వారు వెంటనే స్పందించి ప్రతి కుటుంబానికి కుల ధ్రువీకరణ పత్రాలు అందేటట్లు రెవెన్యూ అధికారులతో మాట్లాడి ఇప్పించి న్యాయం చేస్తానని ఫోన్ లో హామీ ఇచ్చారని తెలిపారు. రాజు నాయక్ మాట్లాడుతూ యానాదులు పడుతున్న కష్టాలను భరించలేక జిపిఎస్ నేతలను ఆశ్రయించారని, విషయం తెలుసుకుని అక్కడ సమస్యలపై ఆరా తీయడం జరిగిందన్నారు. గిరిజనులకు అత్యంత కీలకమైన కుల ధ్రువీకరణ పత్రాలు ప్రతి ఒక్క కుటుంబానికి అందజేయాలని, సంక్షేమ పథకాలను వారికి అందేటట్లు అధికార యంత్రాంగం కృషి చేయాలని కోరారు. 40 ఏళ్లుగా గుడిసె లో ఉంటూ దుర్భర జీవితం గడుపుతున్న సంచార జాతులను ప్రభుత్వం ఆదుకుని వారికి పక్కా ఇళ్లు కట్టించి ఇవ్వాలని వారు ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి గారికి విన్నవించారు. అధికారులు దృష్టి పెట్టి ప్రతి ఒక్కరికి కుల ధ్రువీకరణ (ఎస్టి) పత్రాలు ఇవ్వాలని వారు కోరారు ఈ కార్యక్రమంలో జి పి ఎస్ రాష్ట్ర సహాయ కార్యదర్శి రవి నాయక్, జిల్లా అధ్యక్షుడు బాలు నాయక్, ఉపాధ్యక్షుడు మల్లేష్ నాయక్ కాలనీలో మరియు జిపిఎస్ నాయకులు పాల్గొన్నారు.
 
Tags:The government should support tribal elephants.

Natyam ad