ఉద్యోగ సంఘాల నాయకుల చాకచక్యంతో ప్రభుత్వ టీం ఘన విజయం  

ఆంధ్రప్రదేశ్ ముచ్చట్లు:
 
సజ్జల ఆల్ రౌండ్ ప్రతిభకు, మంత్రుల డిఫెన్స్ తోడవడంతో ప్రభుత్వ టీం ఏ దశలోనూ వెనుదిరిగి చూడలేదు.. ఒక వికెట్ కూడా నష్టపోకుండా అద్భుత విజయం సొంతం చేసుకుంది.సి.ఎస్ వికెట్ల వెనుక కీపింగ్ తో పాటు ఎస్మా, జీతం పెరిగింది, ఐఆర్ అంటే లోన్ అంటూ తనదైన శైలిలో స్లెడ్జింగ్ చేసి ఉద్యోగ సంఘాల నాయకుల మనో ధైర్యాన్ని ముందే దెబ్బ తీయడం ద్వారా.. ఉద్యోగులను మానసికంగా ఓటమికి సిద్ధం చేసారు.ఫైనల్లో ఇరగదీస్తారనుకున్న ఉద్యోగ సంఘాల నాయకులంతా కనీసం ఒక రన్ కూడా సాధించకుండానే గోల్డెన్ డకౌట్ గా వెనుదిరగడం ఎన్నో ఆశలు పెట్టుకున్న ఉద్యోగులను ఆగ్రహానికి గురి చేసింది.బుజ్జగింపుల టీం దయతలచి వదిలేసిన బై రన్స్ మాత్రమే ఉద్యోగుల టీం స్కోర్ బోర్డులో చేరాయి.. * సజ్జల టీం అలసత్వం వలనే ఆ మాత్రం స్కోర్ ఇవ్వవలసింది వచ్చిందని అన్న ఫైర్ అయినట్లు సమాచారం.తదనంతరం జరిగిన మీడియా సమావేశంలో ఉద్యోగ సంఘాల నాయకులు మాట్లాడుతూ బుజ్జగింపుల టీం అద్భుత ప్రతిభ ముందు తమ టీం తలవంచక తప్పులేదని, ఈ విజయానికి వారే నిజమైన అర్హులని తెలిపారు..ఈ రోజు తామే ఓటమిని అంగీకరిస్తూ కప్పును సి.ఎమ్ కి స్వయంగా అందజేస్తామన్నారు.మ్యాన్ (ఉద్యమం ) ఎప్పుడు జరిగినా ఇదే విధంగా తమ సహాయ సహకారాలు అందజేసి ప్రభుత్వ టీం గెలిచేందుకు కృషి చేస్తామని ఉద్యోగ సంఘాల నాయకులు ఉమ్మడిగా తెలియజేశారు.
 
Tags; The government team was a solid success with the ingenuity of the union leaders

Natyam ad