జేసీబీలో భార్యను తీసుకొచ్చిన వరుడు

Date:19/06/2018
బెంగళూర్ ముచ్చట్లు:
ఆపరేటర్‌గా పని చేస్తోన్న ఓ వ్యక్తి పెళ్లి సమయంలోనూ తనకు అన్నం పెట్టే యంత్రం పట్ల మమకారం చూపాడు. పెళ్లయ్యాక భార్యను జేసీబీలోనే తన ఇంటి తీసుకొచ్చాడు. ఈ ఘటన కర్ణాటకలోని దక్షిణ కన్నడ జిల్లాలో చోటు చేసుకుంది. పుత్తూరు తాలుకా సంత్యార్ గ్రామానికి చెందిన చేతన్  పెళ్లి చేసుకున్నాడు. పెళ్లయిన వెంటనే తన మిత్రులను కల్యాణ మండపం వద్దకు జేసీబీని తీసుకురమ్మని కోరాడు. పూలతో అందంగా ముస్తాబు చేసిన జేసీబీలో భార్యను ఎక్కించుకొని తీసుకెళ్లాడు. ఊరి పొలిమేరల్లోకి వెళ్లగానే.. చేతన్ స్నేహితుడు జేసీబీ నడపగా.. వధువరులిద్దరూ జేసీబీ బకెట్లో కూర్చోని ఊరేగింపుగా ఇంటికి చేరుకున్నారు. ఈ అరుదైన ఊరేగింపు కర్ణాటకలో చర్చనీయాంశమైంది.
Tags; The groom who brought the wife in JCB

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *