The guide for the masses is Maanthri Kesheeram

బహుజనులకు మార్గదర్శి మాన్యశ్రీ కాన్షీరాం

Date:15/03/2018

పలమనేరు ముచ్చట్లు:

దళిత బహుజనుల అభివృద్ధికోసం తన జీవితాన్నే అంకితం చేసిన మహనీయుడు మాన్యశ్రీ కాన్షీరాం బహుజనులందరికీ మార్గదర్శి అని బిఎస్పీ నాయకులు తెలిపారు. మాన్యశ్రీ కాన్షీరాం 84 వ జయంతిని పురస్కరించుకొని గురువారం స్థానిక ఆర్ అండ్ బి అతిథి గృహంలో ఆ పార్టీ నియోజకవర్గ అధ్యక్షుడు శ్రీనివాసులు ఆద్వర్యంలో జన్మదిన వేడులను జరుపుకున్నారు. ఈ సందర్భంగా కాన్షీరాం చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మాన్యశ్రీ కాన్షీరాం దళిత బహుజనుల ఐక్యత కోసం, రాజ్యాధికారం సాదనకోసం అలుపెరగని కృషి చేసిన గొప్ప పోరాట యోధుడని కొనియాడారు. బుద్దుడి ప్రవచనాలు, బాబాసాహెబ్ అంబేద్కర్ ఆశయాల సమ్మేళనమే కాన్షిరాం అని అభిప్రాయపడ్డారు. ఈ కార్యక్రమంలో బిఎస్పీ జిల్లా అధ్యక్షుడు శివాడి గోవిందయ్య, మహిళా అధ్యక్షురాలు ప్రమీల, పుంగనూరు నియోజకవర్గ అధ్యక్షుడు ఉత్తరాది హరిప్రసాద్, చంద్ర, సురేంద్ర, శ్రీరామయ్య తదితరులు పాల్గొన్నారు.

 

Tags: The guide for the masses is Maanthri Kesheeram

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *