మాదాపూర్లో భారీగా ట్రాఫిక్ జామ్

హైదరాబాద్  ముచ్చట్లు:
నగరంలోని మాదాపూర్ ఐటీ కారిడార్లలో సోమవారం భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. మెహదీపట్నం నుంచి మాదాపూర్ హైటెక్ సిటీ వైపు వెళ్లే ఉద్యోగులు ట్రాఫిక్లో చిక్కుకుని నరకం అనుభవించారు. జూబ్లీహిల్స్ నుంచి బయోడైవర్సిటీ వరకు నూతనంగా నిర్మించనున్న వేలాడే వంతెన పనులు కారణంగా ట్రాఫిక్ స్తంభించిపోయింది. దాదాపు 3కిలోమీటర్ల దూరానికే అరగంట సమయం పట్టడంతో అసహనానికి గురయ్యారు. ఉదయం, సాయంత్రం వేళల్లో ఈ మార్గంలో ట్రాఫిక్ జామ్ కాకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని వాహనదారులు కోరుతున్నారు.
Tag : The heaviest traffic jam in Madapur


Leave a Reply

Your email address will not be published. Required fields are marked *