The heavy fire in YSR district

వైఎస్సార్ జిల్లాలో భారీ అగ్నిప్రమాదం

Date : 05/01/2018

బద్వేలు ముచ్చట్లు:

వైఎస్సార్ జిల్లాలో గురువారం రాత్రి భారీ అగ్నిప్రమాదం జరిగింది. బద్వేలు గురుకుల పాఠశాల సమీపంలో అగ్నిప్రమాదం సంభవించి సుమారు వెయ్యి గుడిసెలు కాలి బూడిదయ్యాయి. కొంతకాలం క్రితం సీపీఐ నేతల ఆధ్వర్యంలో నిరుపేదలు ఈ ప్రాంతంలో గుడిసెలు వేసుకుని జీవనం సాగిస్తున్నారు.ఇవాళ రాత్రి ఒక్కసారిగా మంటలు చెలరేగి చూస్తుండగానే వెయ్యి గుడిసెలు దగ్ధమయ్యాయి. ఈ ప్రమాదంలో వంటగ్యాస్ సిలిండర్లు పేలుతూ గాలిలోకి ఎగిరాయి. భారీ ఎత్తున మంటలు చెలరేగాయి. అగ్నిమాపక సిబ్బంది వచ్చేలోగానే గుడిసెలు నేలమట్టమయ్యాయి. సిలిండర్ల పేలుడు శబ్దాలకు భయంతో చుట్టుపక్కల జనం పరుగులు పెట్టారు. ఈ ప్రమాదంలో భారీగానే ఆస్తి నష్టం జరిగింది. ఈ సంఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Tags : The heavy fire in YSR district

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *