పుంగనూరు క్రీడలకు పుట్టిన ఇల్లు-ఫక్రుద్దీన్‌ షరీఫ్‌

పుంగనూరు ముచ్చట్లు:

పుంగనూరు జాతీయ క్రీడాకార్లకు పుట్టిన ఇల్లు కావడం అభినందనీయమని మున్సిపల్‌ ఉద్యోగ కార్మిక సంఘ అధ్యక్షుడు ఫక్రుద్దీన్‌ షరీఫ్‌ కోనియాడారు. పట్టణంలోని కొత్తపేటలో శాంతి నగర్‌ యువజన సంఘ సభ్యులు వాలిబాల్‌ పోటీ నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని వైఎస్సాఆర్సీపీ కౌన్సిలర్‌ ఇబ్రహిం ఆధ్వర్యంలో చేపట్టారు. ఈ పోటీలను షరీఫ్‌ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కబడి వాలిబాల్‌ క్రీడాకార్లు ఎంతో మంది ఈ ప్రాంతంలో ఉన్నామన్నారు. వాలిబాలు కబడి పోటిల్లో పుంగనూరు కి చెందిన క్రీడాకార్లు జాతీయ స్థాయి లో పాల్గొని ఏన్నో బంగారు పతకాలు సాధించారని కొనియాడారు. మారుముల ప్రాంతమైనా పుంగనూరుకు క్రీడలతోనే గుర్తింపు లభించిందన్నారు. ఇలాంటి ఆటలలో యువతా మరింతగా పాల్పంచుకోవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో వైఎస్సాఆర్సీపీ నాయకుడు అఫ్సర్‌ తదితరులు పాల్గొన్నారు.

 

Tag:The house that was born to Punganur sports – Fakhruddin Sharif


Leave a Reply

Your email address will not be published. Required fields are marked *