భార్యను అంతమొందించిన భర్త

చిత్తూరు ముచ్చట్లు:
 
పెద్దల సమక్షంలో అగ్నిసాక్షిగా ఇద్దరు ఒక్కటయ్యారు. ఎంతో అన్యోన్యంగా సాగుతున్న దాంపత్య జీవితంలో అనుమానాలు చిచ్చురేపాయి. కట్టుకున్న భార్యనే అంతమొందించాడు ఓ కసాయి భర్త. అత్యంత కిరాతకంగా కత్తితో పొడిచి కడతేర్చేశాడు. ఈ ఘటన చిత్తూరు జిల్లాలో చోటు చేసుకుంది.పీలేరు మండలం బండ్లవంకకు ఎం.రాజశేఖర్ నాయక్ (30), ఎర్రగుంటపల్లి పంచాయతీ ముడుపుల వేములవారిపల్లికి చెందిన రోజా (27)తో పదేళ్ల క్రితం వివాహమైంది. వీరికి తొమ్మిదేళ్ల కుమార్తె షాలిని, ఐదేళ్ల కుమారుడు చేతన్ నాయక్ సంతానం. అన్యోన్యంగా సాగిన వీరి సంసార జీవితంలో అనుకోకుండా అనుమానాలు పుట్టుకొచ్చాయి. దీంతో తరచూ ఇరువురూ గొడవ పడేవారని తెలిసింది.ఈ నేపథ్యంలో రోజా తన పుట్టింటికి వెళ్లిపోయింది.భార్య రోజా దగ్గరకు భర్త నానూ నాయక్ వెళ్లాడు. ఇంట్లో ఎవరూ లేనిది చూసి.. ఆమెను విచక్షణా రహితంగా కత్తితో పొడిచి అంతమొందించాడు. అనంతరం పీలేరు పోలీసు స్టేషన్‌లో పోలీసుల ఎదుట లొంగిపోయాడు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. నిందితుడిపై పీలేరు పోలీసు స్టేషనులో ఇదివరకే ఒక ఎర్రచందనం స్మగ్లింగ్ కేసు, భర్త వేధింపులు భరించలేక భార్య రోజా పెట్టిన మరో రెండు కేసులు ఉన్నట్లు పోలీసులు తెలిపారు.
పుంగనూరు ఖ్యాతిని ఢిల్లీకి తీసుకెళ్లిన వర్మ – ఎంపి రెడ్డెప్ప
Tags: The husband who killed his wife

Natyam ad