భార్యను కడతేర్చిన భర్త

శ్రీకాకుళం ముచ్చట్లు:
 
కుటుంబ కలహాలతో కట్టుకున్న భార్యనే కడతేర్చిన ఘటన శ్రీకాకుళం గ్రామీణ మండలం సానివాడ గ్రామంలో చోటు చేసుకుంది. స్థానికంగా ఈ ఘటన తీవ్ర సంచలనం రేపింది.  గ్రామానికి చెందిన పొన్నాడ నవీన్‌కుమార్‌కు విశాఖపట్నానికి చెందిన కల్యాణితో కొంతకాలం కిందట వివాహం జరిగింది. వీరి మధ్య తరచూ గొడవలు జరుగుతుండేవి.ఈ క్రమంలో క్షణికావేశానికి లోనైన నవీన్‌కుమార్‌ నిద్రపోతున్న కల్యాణిపై తలగడను పెట్టి ఊపిరి ఆడకుండా చేసి హత్య చేశాడు. అనంతరం శ్రీకాకుళం గ్రామీణ పోలీసుస్టేషన్‌కు వెళ్లి లొంగిపోయాడు. వెంటనే సీఐ అంబేడ్కర్‌ ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు.
 
Tags: The husband who seduced the wife

Natyam ad