The increased petrol price

మరింత పెరిగిన పెట్రోల్ ధర 

Date:25/09/2018

న్యూఢిల్లీ ముచ్చట్లు:

గత కొన్ని వారాలుగా దేశంలో ఇంధన ధరలు చుక్కలను తాకుతున్నాయి. అంతర్జాతీయంగా ముడిచమురు ధరలు పెరగడం, డాలర్‌తో రూపాయి మారకం విలువ అంతకంతకూ క్షీణిస్తూ ఉండటంతో పెట్రోల్‌, డీజిల్‌ ధరలు రికార్డు స్థాయిని చేరుకుంటున్నాయి. దీంతో వినియోగదారులపై మరింత భారం పడుతోంది.

 

ఇంధన ధరలు భగ్గుమంతున్డటం తో వినియోగదారుల గుండెలు గుబేల్‌మంటున్నాయి. గత కొంతకాలంగా ఆకాశాన్నంటుతున్న చమురు ధరలు మంగళవారం కూడా మరింత పైపైకి చేరాయి. దేశ ఆర్థిక రాజధాని ముంబయిలో ఇప్పటికే రూ. 90ని దాటిన పెట్రోల్‌ రూ. 100 మార్క్‌వైపు వేగంగా పరుగులు పెడుతోంది. నేడు మరో 14పైసలు పెరగడంతో అక్కడ లీటర్‌ పెట్రోల్‌ ధర రూ. 90.22కు చేరింది.

 

మరో వారం రోజులు ఇలాగే పెరిగితే పెట్రోల్‌ ధర సెంచరీ కొట్టడం ఖాయంగానే కన్పిస్తోంది.దేశ రాజధాని దిల్లీలో లీటర్‌ పెట్రోల్‌ ధర రూ. 82.86గా ఉంది. కోల్‌కతాలో రూ. 84.68, చెన్నైలో రూ. 86.13, హైదరాబాద్‌లో రూ. 87.84గా ఉంది. ఇక డీజిల్‌ కూడా నేడు 10పైసలు పెరిగి దిల్లీలో లీటర్‌ ధర రూ. 74.12కు చేరింది. ముంబయిలో రూ. 78.69, కోల్‌కతాలో రూ. 75.97, చెన్నైలో రూ. 78.36, హైదరాబాద్‌లో రూ. 80.62గా ఉంది.

ఫైబర్ గ్రిడ్ తో… ట్రిపుల్ సర్వీసులు

Tags:The increased petrol price

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *