రోజుకో మలుపు తిరుగతున్న మంత్రి శ్రీనివాస ఇష్యూ.

హైదరాబాద్ ముచ్చట్లు:
ముఖ్యమంత్రి కేసీఆర్ డైరెక్షన్ లోనే బీజేపీ నేతలపై అక్రమ కేసులను బనాయిస్తున్నారని బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. మంత్రి శ్రీనివాస్ గౌడ్ అవినీతిపై వాళ్ల దగ్గర పూర్తి ఆధారాలున్నాయని, అవినీతి మంత్రిని మంత్రివర్గం నుంచి తొలగించాల్సిన కేసీఆర్ ఆయనను రక్షిస్తూ, బీజేపీ నేతలపై కేసులు నమోదు చేసే ప్రయత్నం చేస్తున్నారు. టీఆర్ఎస్ లోనే అవినీతి పరులు అందరూ ఉన్నారని బండి సంజయ్ అన్నారు. మంత్రి అవినీతిని బయటకు తీస్తుంటే కేసులు పెడుతున్నారన్నారు. జితేందర్ రెడ్డి ఇంటికి వెళ్లి దాడి చేయాల్సిన అవసరం ఏమొచ్చిందని బండి సంజయ్ ప్రశ్నించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఫ్రస్టేషన్ లో ఉన్నారన్నారు. ఒక హత్య కుట్ర కేసును మహిళకు ముడిపెట్టడం దారుణమని చెప్పారు. పోలీసుల తీరు చూసి ప్రజలు నవ్వుకుంటున్నారని బండి సంజయ్ అన్నారు. తాము అన్ని దర్యాప్తు సంస్థలను ఆశ్రయిస్తామని చెప్పారు. తాము న్యాయస్థానాలను కూడా ఆశ్రయిస్తామని బండి సంజయ్ అన్నారు.తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పై మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. సాధించుకున్న తెలంగాణను ఎక్కడకు తీసుకెళుతున్నావని ప్రశ్నించారు. తప్పుడు కేసులు పెట్టి మానసికంగా వేధించాలని చూస్తున్నారని అన్నారు. శ్రీనివాస్ గౌడ్ ను ఎవరు ఎందుకు హత్చ చేయాలనుకున్నారో చెప్పాలన్నారు. మహబూబ్ నగర్ నుంచి ఢిల్లీకి వచ్చిన ఎవరికైనా తన ఇంట్లో ఆశ్రయం దొరుకుతుందని జితేందర్ రెడ్డి తెలిపారు. పార్టీ కార్యకర్తలు వస్తే ఎవరైనా ఆశ్రయం ఇస్తారని చెప్పారు. ఉద్యమ కారులపై కేసులు పెడుతున్నారన్నారు. .. తాను మున్నూరు రవికి ఆశ్రయమిచ్చిన మాట వాస్తవమేనని, మున్నూరు రవికి ఎలాంటి క్రిమినల్ బ్యాక్ గ్రౌండ్ లేదని జితేందర్ రెడ్డి అన్నారు. మున్నూరు రవి వెంట ఎవరు వచ్చారో తనకు తెలియదన్నారు. కేసీఆర్ ను చీప్ ట్రిక్స్ ను మానుకోవాలని డిమాండ్ చేశారు. కేసీఆర్ కు భయం పట్టుకునే ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నారని అన్నారు. తన డ్రైవర్ ను అక్రమంగా అరెస్ట్ చేశారన్నారు. తెలంగాణ సంస్కృతిని కేసీఆర్ చెడగొడుతున్నారన్నారు. తన రాజకీయ జీవితం గురించి కేసీఆర్ కు తెలియదా? అని ఆయన ప్రశ్నించారు. దీనిపై పూర్తి స్థాయి విచారణ జరపాలని ఆయన డిమాండ్ చేశారు.మంత్రి శ్రీనివాసగౌడ్ పై హత్యాప్రయత్నం అంతా ఒక డ్రామా అని మాజీ మంత్రి డీకే అరుణ అభిప్రాయపడ్డారు. ఈ కేసులో ఎవరు దోషులో తేలాలన్నారు. తెలంగాణ పోలీసులపై తమకు నమ్మకం లేదని ఆమె చెప్పారు. రాజకీయంగా కుట్ర చేయడానికే ఈ అక్రమ కేసులు బనాయిస్తున్నారని చెప్పారు. ఈ కేసుల వెనక కేసీఆర్, శ్రీనివాస్ గౌడ్ ల కుట్ర ఉందని చెప్పారు. సీబీఐ తో…. మంచి పోలీసు అధికారిగా పేరున్న స్టీఫెన్ రవీంద్ర ను కూడా ఈ ప్రభుత్వం లొంగదీసుకుందని డీకే అరుణ ఆరోపించారు. బీహారీ అధికారులతో తెలంగాణలో కేసీఆర్ అరాచకం సృష్టించేందుకు ప్రయత్నిస్తున్నారని ఆమె ఆరోపించారు. ఈ కేసును సీబీఐ లాంటి స్వతంత్ర సంస్థ చేత దర్యాప్తు చేయించాలని కోరారు. అవసరమైతే తాము న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తామని ఆమె పేర్కొన్నారు.
 
Tags:The issue of Minister Srinivasa, which is turning into a daily issue

Natyam ad