కేసీఆర్ గ్రాఫ్ తగ్గుతోంది.

హైదరాబాద్ ముచ్చట్లు:
తెలంగాణ సీఎం కేసీఆర్‌ తన ఎన్నికల వ్యూహకర్తగా ప్రశాంత్‌ కిషోర్‌ను నియమించుకోవడంపై సెటైర్లు వేశారు మాజీ మంత్రి, కాంగ్రెస్‌ నేత గీతారెడ్డి.. మన గ్రాఫ్ పెరుగుతుంది.. సీఎం కేసీఆర్‌ గ్రాఫ్ తగ్గుతుందన్న ఆమె.. ట్యూషన్ టీచర్‌ని ఎందుకు పెడతాం..? పిల్లలు వీక్‌గా ఉంటేనే కదా..? అని ప్రశ్నించారు.. అంటే కేసీఆర్‌ వీక్‌ అయ్యాడు కాబట్టే.. ట్యూషన్‌ టీచర్‌ని తెచ్చుకున్నారంటూ ఎద్దేవా చేశారు గీతారెడ్డి.. ఇక, తెలంగాణలో వచ్చేది మన ప్రభుత్వమే అంటూ ధీమా వ్యక్తం చేశారు. మరోవైపు.. రాష్ట్రంలో కాంగ్రెస్‌ సభ్యత్వ నమోదుపై సంతృప్తి వ్యక్తం చేశారు గీతారెడ్డి.. బూత్ కమిటీల్లో కాంగ్రెస్‌ వీక్.. కానీ, బూతుల స్థాయిలో సభ్యత్వ నమోదుతో ఆ వెలితి పోయిందన్నారు.. దేశంలోనే సభ్యత్వ నమోదులో తెలంగాణ నెంబర్ వన్‌గా నిలిచిందని సంతోషాన్ని వ్యక్తం చేశారు గీతారెడ్డి.
 
Tags:The KCR graph is declining

Natyam ad