ఢిల్లీ నేతల పొగడ్తలుతో   లోకల్ నేతలకు ఇక్కట్లు

Date:21/02/2018
హైద్రాబాద్ ముచ్చట్లు:
తెలంగాణకు వచ్చిన కేంద్ర మంత్రులు టిఆర్ఎస్ ప్రభుత్వాన్ని పొగుడుతున్నారు. కేసీఆర్ పాలన తీరు చాలా అద్భుతంగా ఉందని కితాబునిస్తున్నారు. వ్యవసాయం, ఉచిత విద్యుత్, రైతు రుణాలు, మిషన్ కాకతీయ, మిషన్ భగీరధ వంటివి చాలా బాగున్నాయని చెబుతున్నారు. ఇది  ఆపార్టీ బీజేపీ నేతలకు ఇబ్బందిగా మారింది. కాంగ్రెస్, కమ్యూనిస్టులు, టీడీపీ వాళ్లు పనిగట్టుకుని మరీ బీజేపీని తిడుతున్నారు. పగలు పోట్లాటలు, రాత్రికి పంచాయితీలు,రాజీలు అంటూ విమర్ళిస్తున్నారు. ఇదే సమయంలో పుండు మీద కారం చల్లినట్లు అవుతోంది వారి పరిస్థితి. కేసీఆర్ రైతులకు ఇస్తున్న 24 గంటల విద్యుత్ పథకాన్ని చాలా మంది కేంద్ర మంత్రులు ప్రశంసించారు. అది తెలంగాణ బీజేపీనేతలకు కోపం తెప్పిస్తోంది. మేము ఎంతో కష్టపడి కేసీఆర్ తీరుకు వ్యతిరేకంగా పోరాడుతున్నాం. కానీ మీరు వచ్చి ఇక్కడ పాలన బాగుందంటే ఇక జనాల వద్దకు ఎలా వెళ్లాలనేది వారి ఆలోచనగా ఉంది. కేంద్ర మంత్రులు మీడియా సమక్షంలోగానీ, పార్లమెంట్‌లోగానీ రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశంసించినవి ఉంటే చెప్పాలని ఎదురు దాడి చేస్తోంది. కేసీఆర్ సర్కార్ కావాలని మీడియాకు లీక్ లు ఇస్తు తమను ఇబ్బంది పెడుతుందని చెబుతున్నారు. కిషన్ రెడ్డి, బండారు దత్తాత్రేయ, లక్ష్మణ్ వంటి నేతలు ఈ సంగతిని సీరియస్ గానే హైకమాండ్ కు చెప్పారు. అందుకే ఇక ముందు కేంద్ర మంత్రులు ఎవరొచ్చినా కేసీఆర్ ను పొగడకుండా తమ పని ముగించుకుని వెళ్లే ఆలోచన చేస్తున్నారట. గడ్కరీ చాలా సార్లు కేసీఆర్ తీరును మెచ్చుకున్నారు. వ్యవసాయ శాఖ మంత్రి రాధా మోహన్ సింగ్, నిర్మాల సీతారామన్ అలానే చేశారు. రానుంది ఎన్నికల కాలం కాబట్టి కేంద్ర మంత్రులు కాస్తంత ఆచితూచి వ్యవహరిస్తారేమో.
Tags: The leaders of the Delhi leaders have come to the local leaders

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *