The magazine is the backbone of democracy:

పత్రికలే ప్రజాస్వామ్యానికి వెన్నెముక: వెలగపూడి

ఏయూలో ‘వెలుగు కిరణం’ క్యాలండర్ ఆవిష్కరణ

Date : 09/01/2018

విశాఖపట్నం ముచ్చట్లు :

పత్రికలే ప్రజాస్వామ్యానికి వెన్నెముక అని ఆంధ్రాయూనివర్సిటీ రిజిస్ట్రార్‌ ఆచార్య వి.ఉమామహేశ్వరరావు తెలిపారు. వర్సిటీలోని రిజిస్ట్రార్‌ కార్యాలయంలో ‘వెలుగుకిరణం’ మాసపత్రిక క్యాలెండర్‌ను ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా రిజిస్ట్రార్‌ మాట్లాడుతూ ఇటీవల కాలంలో సామాన్యులమీద మీడియా ప్రభావం ఎంతో ఉందన్నారు. దేశ ప్రగతికి మీడియా విశేషంగా కృషిచేస్తుందన్నారు. పాలనలోని అవినీతిని ఎండగట్టి సామాన్యునికి మీడియా నేడు వెన్నుదన్నుగా నిలవడం అభినందించదగ్గ పరిణామం అన్నారు. విభిన్న కథనాలతో దేశ ప్రగతిని కాంక్షిస్తున్న పాత్రికేయుల సేవలు ప్రశంసనీయం అన్నారు. ఈ కార్యక్రమంలో ‘వెలుగు కిరణం’ పత్రిక సంపాదకులు డాక్టర్‌ హనుమంతు లక్ష్మణరావు, ఏయూ ప్రెస్‌ అండ్‌ పబ్లికేషన్‌ డీన్‌ ఆచార్య టివి.కృష్ణ, ఐఏఎస్‌ఇ ప్రిన్సిపాల్‌ ఆచార్య ఆర్‌.రంగనాథన్‌, మూడో పట్టణ ట్రాఫిక్‌ సిఐ కూన దుర్గాప్రసాదరావు, ఎస్‌ఆర్‌ లీలెదర్‌ ఎండి ఎం.శేషగిరిరావు, డాక్టర్‌ బిపిఎస్‌ కళ్యాణి, డాక్టర్‌ ఆర్‌.విజయ్‌కుమార్‌, హెచ్‌.లోకనాథం తదితరులు పాల్గొన్నారు.

Tags : The magazine is the backbone of democracy:

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *