The man in the 'beaver' attack has serious injuries

‘ఎలుగు’ దాడిలో వ్యక్తికి తీవ్ర గాయాలు

కన్ను, ముక్కు ఛిద్రం

Date: 25/12/2017

బెజ్జూరుముచ్చట్లు: 

ఎలుగుబంటి దాడిలో వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా బెజ్జూరు మండలం రేచిని గ్రామానికి చెందిన మోర్ల గణపతి ఆదివారం మేకలకు మేత తెచ్చేందుకని గ్రామ సమీపంలో అటవీ ప్రాంతానికి వెళ్లాడు. మేత తీసుకుని తిరిగి వస్తుండగా పొదల మాటు నుంచి వచ్చిన ఎలుగుబంటి దాడి చేసింది. ముఖంపై రక్కడంతో బాధితుని ఓ కన్ను పూర్తిగా పోయింది. ముక్కు ఛిద్రమవడంతోపాటు…ఛాతీపై పలుచోట్ల గాయాలయ్యాయి. స్థానికులు బాధితుణ్ని కాగజ్నగర్ ఆసుపత్రికి తరలించారు. అటవీశాఖ అధికారులు, గ్రీన్ ఫోర్స్ సిబ్బంది గణపతిని పరామర్శించి..దాడి జరిగిన తీరును అడిగి తెలుసుకున్నారు.బాధితునికి పరిహారం అందేలా చూస్తామని హామీ ఇచ్చారు.

Tags: The man in the ‘beaver’ attack has serious injuries

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *