ఘనంగా అంతర్వేది శ్రీ లక్ష్మీ నృసింహ స్వామి కళ్యాణం

రాజోలు ముచ్చట్లు:
 
నవ నారసింహ క్షేత్రాలలో అత్యంత విశిష్టత కలిగిన అంతర్వేది శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారి కళ్యాణం నయనానందకరంగా జరిగింది. పండితుల వేద మంత్రోచ్చారణలు, భక్తుల జయజయ ద్యానాల మధ్య    శుక్రవారం రాత్రి మృగశిర నక్షత్ర యుక్త వృశ్చిక లగ్నం అందు నరసింహ స్వామి వారి కళ్యాణం ఘనంగా జరిగింది. తూర్పు గోదావరి జిల్లా సఖినేటిపల్లి మండలం అంతర్వేది శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారి కళ్యాణోత్సవాలలో భాగంగా అశేష భక్త జనం మధ్య కళ్యాణం సాంప్రదాయ బద్ధంగా సాగింది.. శ్రీదేవి భూదేవి సమేత నరసింహుని ముత్యాల పల్లకి లో కళ్యాణ వేదిక వద్దకు తీసుకువచ్చి ప్రతిష్టించారు. కళ్యాణ ఘట్టం లోని క్రతువులు అన్ని పండితులు ఘనంగా నిర్వహించారు… దివ్య ముహూర్త సమయం అయిన రాత్రి 12:35 నిమిషాలకు దేవతా మూర్తుల శిరస్సుపై జీలకర్రబెల్లం పెట్టారు. మంగళసూత్రధారణ, తలంబ్రాల ఘట్టాన్ని రమణీయంగా సాగించారు… కళ్యాణం ఆద్యంతం భక్తులు భక్తి పారవశ్యంలో మునిగి తేలారు. వేలాదిగా తరలి వచ్చిన భక్తులు కళ్యాణ ప్రకారం లోనే కాక ఆలయ ఆవరణలో ఏర్పాటు చేసిన భారీ ఎల్ఈడి స్క్రీన్ లపై కూడా కళ్యాణాన్ని భక్తులు తిలకించారు. స్వామి, అమ్మవార్లకు తిరుమల తిరుపతి దేవస్థానం, అన్నవరం, శృంగేరి శారదా పీఠం నుండి పట్టు వస్త్రాలు సమర్పించారు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున రాష్ట్ర బిసి సంక్షేమ శాఖ మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాల కృష్ణ పట్టు వస్త్రాలు సమర్పించారు.
 
Tags; The marriage of Sri Lakshmi Narasimha Swamy is richly Antarvedi

Natyam ad