మంత్రి హత్యకు కుట్రపై విచారణ చేయాలి.

హైదరాబాద్ ముచ్చట్లు :
రాష్ట్ర మంత్రి శ్రీనివాస్‌ గౌడ్‌ హత్య కుట్రను హైదరాబాద్‌ పోలీసులు చేధించిన విషయం తెలిసిందే. హైదరాబాద్‌లో తీగ లాగితే ఢిల్లీ వరకు ఈ కేసు సంచలనంగా మారింది. మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ను సుపారీ గ్యాంగ్‌తో చంపేందుకు ప్లాన్ చేశారని, ఇందుకోసం ఏకంగా రూ.15 కోట్ల డీల్ కూడా జరిగినట్లు సైబరాబాద్ సీపీ స్టిఫెన్ రవీంద్ర పేర్కొన్నారు. అయితే అప్రూవర్‌గా మారిన ఫరూక్‌ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ సంచలన విషయం వెలుగులోకి వచ్చింది. కాగా.. మంత్రి శ్రీనివాస్ గౌడ్ హత్యయత్నం కేసులో ఇప్పటివరకు 8 మందిని సైబరాబాద్ పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. కాగా.. ఈ విషయంపై కాంగ్రెస్ రాష్ట్ర నాయకుడు దాసోజు శ్రవణ్  పలు అనుమానాలు వ్యక్తంచేశారు. సాక్షాత్తు మంత్రినే చంపడానికి కుట్ర జరిగింది కావున.. ఈ ఘటనలో పెద్ద వాళ్ళ పాత్రపై సీబీఐ విచారణ జరిపించాలని శ్రవణ్ డిమాండ్‌ చేశారు. మంత్రిని హత్య చేయడానికి జాతీయ స్థాయి బీజేపీ నాయకుల పాత్ర ఉందేమో అన్న రీతిలో పోలీసులు వ్యాఖ్యానించడం అనేక అనుమానాలు రేకెత్తిస్తున్నాయన్నారు. మంత్రి హత్య కోసం రూ.12 కోట్లు ఎవరు, ఎక్కడ ఇచ్చారు..? సుపారీ హంతకుల వద్ద దొరికిన తుపాకులెవరివి..? అసలు మంత్రి హత్యా చేయాలనుకోవడానికి కారణాలు ఏంటి..? అనే వాటిపై పోలీసులు నిగ్గుతేల్చి బహిర్గతం చేయాలని దాసోజు కోరారు.ఈ వ్యవహారం మొత్తం సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాను తలపిస్తుందని దాసోజు శ్రవణ్ అభిప్రాయపడ్డారు. మంత్రి శ్రీనివాస్ గౌడ్.. ఆరోపణలు ఎదుర్కుంటున్న బీజేపీ జాతీయ నాయకులతో సహా, సైబరాబాద్ కమీషనర్ స్టీఫెన్ రవీంద్రలను బహిరంగంగా లై డిటెక్టర్ టెస్టులు నిర్వహించి నిజాలు నిగ్గు తేల్చాలని దాసోజు శ్రావణ్ డిమాండ్ చేశారు. మంత్రినే చంపడానికి కుట్ర జరిగిన ఘటనపై సీబీఐతో విచారించాలని సూచించారు.కాగా.. మంత్రి శ్రీనివాస్ గౌడ్ హత్య కుట్రపై పేట్‌బషీరాబాద్ పీఎస్‌లో కేసు నమోదైంది. ఈ ప్లాన్‌లో ఉన్న నాగరాజు, యాదయ్య, విశ్వనాథ్‌ను నిన్న హైదరాబాద్‌లో అరెస్ట్ చేశారు పోలీసులు.. నాగరాజుపై గతంలోనూ పలు హత్య కేసులు ఉన్నట్లు గుర్తించారు. ఈ ముగ్గురు ఇచ్చిన సమాచారంతో హత్య కుట్రలో నిందితుడిగా ఉన్న మున్నూరు రవిని ఢిల్లీలో బీజేపీ నేత మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి క్వార్టర్‌లో అరెస్ట్ చేశారు.
 
Tags:The minister should be prosecuted for conspiracy to murder.

Natyam ad