మంత్రిగారి నోట బూతులు

Date:16/03/2018
చెన్నై ముచ్చట్లు:
తమిళనాడు ఆరోగ్య శాఖ మంత్రి విజయ్ భాస్కర్ ఒక మహిళా జర్నలిస్టును ఉద్ధేశించి చేసిన సెక్సీ కామెంట్లు వివాదాస్పదంగా మారుతున్నాయి. ‘నీ స్పెడ్స్ చాలా బాగున్నాయ్.. నువ్వు కూడా చాలా అందంగా ఉన్నావ్..’ అని అంటూ లేడీ టీవీ రిపోర్ట్ ను ఉద్దేశించి విజయ్ భాస్కర్ వ్యాఖ్యానించారు. ఒకసారి కాదు.. పదే పదే అదే మాట మాట్లాడి ఈ మంత్రి వివాదాన్ని రేపాడు.కావేరీ వాటర్ బోర్డ్ కు సంబంధించి తమిళనాడు ప్రభుత్వ ముఖ్యులు జరిపిన సమావేశానికి విజయ్ భాస్కర్ హాజరయ్యాడు. సమావేశం ముగిసిన తర్వాత విలేకరులు ఏం మాట్లాడారో చెప్పాలని కోరారు. అయితే వారి మాటలను విజయ్ భాస్కర్ పట్టించుకోలేదు. ఒక మహిళా జర్నలిస్టును ఉద్దేశించి సెక్సీ కామెంట్లు చేస్తూ వెళ్లాడు.విలేకరులు కనపడగానే.. మహిళా రిపోర్టర్ వైపు చూస్తూ..‘నీ కళ్ల జోడు అందంగా ఉంది..’ అంటూ మొదలుపెట్టాడు. ఆ తర్వాత ఆమె ఏం అడిగినా.. ‘నువ్ అందంగా ఉన్నావ్.. అందంగా ఉన్నావ్.. అందంగా ఉన్నావ్..’ అంటూ వెళ్లాడు. దూరంగా వెళ్లిన తర్వాత కూడా ఆ లేడీ జర్నలిస్టును ఉద్ధేశించి.. ఇవే మాటలే మళ్లీ అన్నాడు. ఇదంతా వీడియోల్లో రికార్డు అయ్యింది. ఒక మహిళా జర్నలిస్టును ఉద్దేశించి మంత్రి ఇలా మాట్లాడటం వివాదాస్పదం అవుతోంది.
Tags: The Minister’s mouthpiece

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *