The ministers who released the APU Duvuzlize diary were canal and goddess

ఏపియు డబ్యూజ్లిజె డైరీని విడుదల చేసిన మంత్రులు కాలువ, దేవినేని

Date:03/02/2018

కృష్ణాముచ్చట్లు:

ఏపియు డబ్యూజ్లిజె 2018 డైరీని రాష్ట్ర మంత్రులు కాలువ శ్రీనివాసులు, దేవినేని ఉమామహేశ్వరరావు విడుదల చేశారు. సంఘ నాయకులు ఆవుల నగేష్‌, వెంకట్రావు, బాబు, కిషోర్‌ల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి మంత్రులు హాజరై, డైరీ విడుదల చేశారు. ఈ సందర్భంగా మంత్రి కాలువ మాట్లాడుతూ జర్నలిస్టులకు మూడు బెడ్‌రూముల ఇండ్ల నిర్మాణ విషయమై ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుతో చర్చించి, చర్య తీసుకుంటామన్నారు. జర్నలిస్టులందరిని సబ్సిడి మీద ఇండ్లు మంజూరు చేస్తామని మంత్రి తెలిపారు. జర్నలిస్టుల సమస్యలన్ని పరిష్కరిస్తామని మంత్రి హామి ఇచ్చారు.

Tags : The ministers who released the APU Duvuzlize diary were canal and goddess

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *