The most expensive medicine .. Rs 5 crore

అత్యంత ఖరీదైన మెడిసిన్‌.. రూ.5కోట్లు

ఈనాడు

Date: 04/01/2018

న్యూయార్క్‌: అమెరికాలోని ఫిలడెల్ఫియాకు చెందిన స్పార్క్‌ థెరపిటిక్స్‌ అనే సంస్థ అంధత్వాన్ని తగ్గించేందుకు అత్యంత ఖరీదైన మెడిసిన్‌ తయారుచేసింది. లక్స్‌టర్నా అనే పేరుగల ఈ మెడిసిన్‌ వంశపారపర్యంగా వచ్చే రెటీనా జీవకణజాల క్షీణతకు సంబంధించిన రుగ్మతను తగ్గిస్తుందట. దీని ధర రూ.5,39,79,250 (8,50,000 డాలర్లు)గా నిర్ణయించింది. మెడిసిన్‌ ఒకే డోసులో ఉంటుందని కంపెనీ వెల్లడించింది. ఒక కన్నుకే అయితే రూ.2,69,89,625(4,25,000 డాలర్లు) అని తెలిపింది. ఎఫ్‌డీఏ అనుమతి కోసం ప్రతిపాదనలు పంపినప్పుడు ఒక్కో కన్నుకు మెడిసిన్‌ ధర 10 లక్షల డాలర్లుగా పేర్కొనగా.. ప్రస్తుతం ధర తగ్గించారు. ఈ ఇంత ఖరీదైన మెడిసిన్‌పై అమెరికాలో చర్చ జరుగుతోంది. మెడిసిన్‌ పనిచేయకపోతే డబ్బు తిరిగి ఇచ్చేస్తామని కంపెనీ చెప్తోంది. ప్రస్తుతం వంశపారపర్యంగా వచ్చే ఈ రెటీనా క్షీణతకు సంబంధించి అమెరికాలో 1000 కేసులు ఉన్నట్లు సమాచారం. ఏటా పది నుంచి ఇరవై కొత్త కేసులు చేరుతున్నాయట. ప్రస్తుతం ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన మెడిసిన్‌ గ్లైబెరా. దీన్ని డచ్‌కు చెందిన యూనీక్యూర్‌ అనే కంపెనీ పది లక్షల డాలర్లకు అమ్ముతోంది. ఇది జన్యుపరమైన సమస్యలను నయం చేసేందుకు ఉపయోగపడుతుంది.

Tags:The most expensive medicine .. Rs 5 crore

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *