The mother paid Rs 6,27,87,811 to the mother

తల్లికి చెల్లించాల్సింది రూ.6,27,87,811

Date: 04/01/2018

ఈనాడు

తైవాన్‌: మా పిల్లలు డాక్టర్‌, ఇంజీనీర్‌, పైలట్‌…ఇలా ఏదో రంగంలో స్థిరపడాలి. అందుకు ఎంత ఖర్చైనా సరే వాళ్లకి ఏ లోటు లేకుండా చూడాలి… తల్లిదండ్రుల ఆలోచనలు ఇలానే ఉంటాయి. ఉన్నదంతా ­డ్చి వారి బాగు కోసమే ఖర్చు చేస్తారు. భవిష్యత్తులో తాము అనారోగ్యం పాలైతే ఎవరు చూసుకుంటారు అనే భయమే ఉండదు వారిలో. అంతగా నమ్ముతారు పిల్లలను. కానీ తైవాన్‌కు చెందిన ఒక తల్లి మాత్రం కోర్టుకు వెళ్లి మరీ తన హక్కులను సాధించుకుంది. తైవాన్‌కు చెందిన ఒ వ్యక్తి తన భార్యాపిల్లలను వదిలేశాడు. ఆయన భార్య మాత్రం పిల్లలను అల్లారు ముద్దుగా పెంచుకుంది. వారికి ఏలోటు లేకుండా ఉన్నత చదువులు చదివించింది. తల్లి కోరుకున్న విధంగానే పిల్లలిద్దరూ ఆర్థికంగా ఉన్నత స్థాయిలో ఉన్నారు. ఆమె కూడా ముందు జాగ్రత్తతో వారు మేజర్స్‌ అయిన తరవాత తన భవిష్యత్తు కోసం వారి లాభాల్లో 60 శాతం చెందేలా ఒప్పంద పత్రం రాయించుకుంది. ­హించినట్లే వారి వ్యక్తిగత జీవితాల్లో పడి ఆమెను పట్టించుకోవడం మానేశారు. దీంతో కలత చెందిన ఆమె కొడుకులను సంప్రదించింది. పెద్దవాడు ఏ గొడవ లేకుండా అనుకున్న మొత్తం ఇచ్చేశాడు. కానీ రెండో కొడుకు మాత్రం ‘పిల్లలను పెంచడం తల్లిదండ్రుల బాధ్యత, పిల్లలతో ఇలాంటి ఒప్పందాలు చేసుకొని సంప్రదాయాలకు తన తల్లి భంగం కలిగిస్తుంద’ని కోర్టులో కేసు వేశాడు. తీర్పు కూడా అతడికే అనుకూలంగా వచ్చింది. అయితే ఆమె సుప్రీం కోర్టును ఆశ్రయించింది. ‘మేజర్స్‌ అయిన తరవాతే ఒప్పందం జరిగింది అంతేకాకుండా ఆ మొత్తాన్ని చెల్లించే స్తోమత అతడికి ఉందని వెంటనే 6 కోట్లు ఇవ్వాల’ని సుప్రీం తీర్పు ఇచ్చింది. తైవాన్‌లో పిల్లలు వృద్ధ తల్లిదండ్రులను వదిలేస్తున్న కేసులు రోజురోజుకు ఎక్కువవుతున్నాయి. దీనికి సంబంధించిన చట్టం ఏర్పాటుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి.

Tags: The mother paid Rs 6,27,87,811 to the mother

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *