Natyam ad

పరిపాలన సౌలభ్యం కోసమే కొత్త జిల్లాలు

విజయవాడ ముచ్చట్లు:
 
పరిపాలన సౌలభ్యం కోసం  ముఖ్యమంత్రి  వైయస్ జగన్మోహన్ రెడ్డి ప్రతి పార్లమెంట్ నియోజకవర్గాన్ని జిల్లాగా చేయడాన్ని హర్షిస్తు వైసీపీ తూర్పు నియోజకవర్గ ఇంచార్జి దేవినేని అవినాష్ ఆధ్వర్యంలో విజయవాడలో భారీ ర్యాలీ నిర్వహించారు. ఎన్టీఆర్ సర్కిల్ వద్ద మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు,సీఎం జగన్ చిత్రపటానికి మరియు ఎన్టీఆర్ విగ్రహానికి పాలాభిషేకం చేసారు. దేవినేని అవినాష్ మాట్లాడుతూ పాదయాత్రలో ఇచ్చిన మాట ప్రకారం జిల్లాకి ఎన్టీఆర్ పేరు పెట్టారు పరిపాలన సౌలభ్యం కోసం జిల్లాలను పెంచారు. ఎన్టీఆర్  పేరు జిల్లాకు పెట్టినందుకు జగన్ కి ధన్యవాదాలు. ఎన్టీఆర్ ముఖ్యమంత్రి గా ఉన్న సమయంలో ఆ పదవిని దొంగలాగా చంద్రబాబు దోచుకున్నాడు. ఎన్టీఆర్ పేరు కనుమరుగు అయ్యే విధంగా చంద్రబాబు ఇంతకాలం ప్రవర్తించాడు. ఎన్టీఆర్ పేరు జిల్లాకి పెట్టి చారిత్రాత్మక నిర్ణయం తీసుకున్నారు సీఎం జగన్ అని అన్నారు.
 
టీడీపీ నేతలు దీనిపై ఆనందం వ్యక్తం చేయకపోవడం చాలా బాధగా ఉంది. నారా లోకేష్ తో పాటు మిగిలిన టీడీపీ నేతలు ఇప్పుడు ఏమి అయిపోయారని అయన అన్నారు.  చంద్రబాబు ముఖ్యమంత్రి గా ఉన్న ఇంతకాలంలో ఎన్టీఆర్  కోసం ఏమి చేశారో చెప్పాలి. చంద్రబాబు, ఆయన కుటుంబ సభ్యులు చేయాలేని పని సీఎం జగన్ చేసి చూపించారు. దేవినేని నెహ్రూ కి ఎన్టీఆర్ రాజకీయ భవిష్యత్ ఇచ్చారు,,వైస్సార్ పునర్జన్మ ఇచ్చారు. జగన్ చేస్తున్న మంచి పనులు చూసి, ఇప్పటికైనా టీడీపీ నేతలు సిగ్గు తెచ్చుకోవాలి. జగన్ రెండున్నారేళ్ల పాలనలో ఎన్నో కీలక నిర్ణయాలు తీసుకొని పేదలకు అండగా నిలిచారు. ఆ కార్యక్రమంలో కమ్మ కార్పొరేషన్ చైర్మన్ తుమ్మల చంద్రశేఖర్, కార్పొరేటర్లు, మాజీ డిప్యూటీ మేయర్లు,మరియు వైసీపీ నేతలు, కార్యకర్తలు పాల్గోన్నారు.
పుంగనూరులో రిపబ్లిక్‌డే నాడు బిరియాని విక్రయాలు
Tags: The new districts are for administrative convenience only