The nuclear button is my table

అణు బటన్‌ నా టేబుల్‌ మీదే ఉంటుంది

ఈనాడు.

Date :01/01/2018

ప్యాంగ్యాంగ్‌: అణు బటన్‌ ఎల్లప్పుడూ తన టేబుల్‌ మీదే ఉంటుంది అని అంటున్నారు ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్‌ జోంగ్‌ ఉన్‌. అమెరికా తమ దేశం గురించి రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తే ఏ క్షణానైనా ఆ బటన్‌ను ఉపయోగించాల్సి వస్తుందని కిమ్‌ హెచ్చరించారు. అణు ప్రయోగాల విషయంలో దక్షిణ కొరియాతో చర్చలు జరిపేందుకు తాను సిద్ధంగా ఉన్నానని తెలిపారు.న్యూఇయర్‌ సందర్భంగా కిమ్‌ మీడియాతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా అమెరికా గురించి ప్రస్తావించారు. ఉ.కొరియాపై అమెరికా ఎప్పటికీ యుద్ధం చేయలేదని ఆ దేశాన్ని నాశనం చేసే శక్తి తమ అణు ఆయుధాలకు ఉందని తెలిపారు. శాంతిని కోరుకునే బాధ్యతగల అణు దేశం ఉ.కొరియా అని పేర్కొన్నారు. తమ దేశం పట్ల రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయనంత వరకు అణు శక్తులు ప్రయోగించమన్నారు. మున్ముందు ఉ.కొరియా మరిన్ని బాలిస్టిక్‌ క్షిపణులు తయారుచేయాలని సూచించారు. అణు ప్రయోగాల పరిశోధనలు జరిపే ప్రాంతాల్లో అణు ఆయుధాలు ఎక్కువగా ఉండేలా చూడాలని పిలుపునిచ్చారు.దక్షిణ కొరియాలో ఫిబ్రవరిలో జరగబోయే వింటర్‌ ఒలింపిక్‌ క్రీడలకు ఉ.కొరియా నుంచి డెలిగేట్లను పంపుతానని కిమ్‌ ఈ సందర్భంగా చెప్పారు. ఉ.కొరియాకి చెందిన క్రీడాకారులు ద.కొరియాలో జరిగే ఒలింపిక్స్‌లో పాల్గొనడం వల్ల ఇరు దేశాల మధ్య సత్సంబంధాలు బలపడతాయన్నారు.
Tags : The nuclear button is my table

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *