The pearl chaired by Punganoor Press Clam

పుంగనూరు ప్రెస్‌ క్ల బ్‌ అధ్యక్షుడుగా ముత్యాలు

Date:24/01/2018

పుంగనూరు ముచ్చట్లు:

పుంగనూరు ప్రెస్‌ క్ల బ్‌ అధ్యక్షుడుగా ఎన్‌.ముత్యాలు ఏకగ్రీవంగా ఎన్నికైయ్యారు. ఎన్నికలు సీనియర్‌ జర్నలిస్టులు పి.ఎన్‌.ఎస్‌.ప్రకాష్‌ , ఇ.మురళి, వసంతకుమార్‌ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా విలేకరులు ఏకగ్రీవంగా కెసిటివి అధినేత ముత్యాలు ను ఎన్నుకున్నారు. అలాగే ఉపాధ్యక్షుడుగా హేమంత్‌కుమార్‌(సాక్షి), ప్రధాన కార్యదర్శిగా ఇ.మురళి(ప్రజాశక్తి), సంయుక్త కార్యదర్శిగా నరసింహారెడ్డి(ఆంధ్రభూమి), కోశాధికారిగా వసంత్‌కుమార్‌(సాక్షిటివి), కార్యవర్గ సభ్యులుగా నాగరాజపరాంకుశ(వార్త), టివి9 రిపోర్టర్‌ సురేష్‌కుమార్‌, తెలుగుముచ్చట్లు విలేకర్లు ఎం.బాబు, కె.రెడ్డిప్రసాద్‌, దీపక్‌, సురేష్‌కుమార్‌, వెంకటరమణ, హరిష్‌, గంగాధర్‌, కెసిటివి విలేకరులు అశోక్‌, శివకుమార్‌లు ఎంపికైయ్యారు. అలాగే న్యాయసలహాదారుగా పి.ఎన్‌.ఎస్‌.ప్రకాష్‌ను ఎన్నుకున్నారు. నూతన అధ్యక్షుడు ముత్యాలు మాట్లాడుతూ విలేకరుల సమస్యల కోసం పోరాటం చే స్తామన్నారు. సుదూర ప్రాంతాల నుంచి వస్తున్న విలేకరులకు ఆశ్రయం కల్పించేందుకు భవనం నిర్మిస్తామన్నారు. ఈ విషయమై విలేకరులతో కలసి ఎమ్మెల్యే డాక్టర్‌ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని, ఎంపి మిధున్‌రెడ్డి ని కలసి నిధులు కోరుతామని తెలిపారు. విలేకరులు ఐకమత్యంతో సమస్యలపై పోరాడేందుకు ముందుకు రావాలని కోరారు.

Tags : The pearl chaired by Punganoor Press Clam

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *