ద్వారక తిరుమలలో వ్యక్తి ఆత్మహత్య

Date: 09/01/2018

ద్వారక తిరుమల ముచ్చట్లు:

ద్వారక తిరుమలలో వ్యక్తి పురుగుల మందు తాగి డార్మెటరీలో ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పోలీసుల కథనం ప్రకారం.. సోమవారం ఒక వ్యక్తి ద్వారకా తిరుమలలోని వెంకటేశ్వర స్వామి దర్శనానికి వచ్చాడు. అతను అక్కడే ఉన్న దేవాలయపు కాటేజీలో గదని అద్దెకు తీసుకొని ఉన్నాడు. మంగళవారం ఉదయం 5 గంటల ప్రాంతంలో దేవాలయ సూపరిండెంట్‌ గదికి వచ్చి చూడగా వ్యక్తి అపస్మారక స్థితిలో ఉండటం గమనించాడు. వెంటనే అందుబాటులో ఉన్న హౌం గార్డ్‌ సహాయంతో అతన్ని చికిత్స నిమిత్తం 108 వాహనంలో ఏలూరు జిల్లా కేంద్ర ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ పరిస్థితి విషమించి మఅతి చెందాడు. అతను ఎవరనే వివరాలు దేవాలయ సిబ్బంది వద్ద లేవు.
అతను రిజిస్టర్‌లో రాసిన వివరాల ప్రకారం అతని పేరు రామారావు విశాఖపట్నంగా తెలుస్తోంది. మఅతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి తరలించారు. ద్వారక తిరుమల పోలీసులు అనుమానాస్పద మఅతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Tags : The person in Dwarka Thirumala is suicidal

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *