తెలంగాణలో పోలింగ్ ప్రశాంతం

– మీడియాతో రజత్ కుమార్,
Date:07/12/2018
హైదరాబాద్ ముచ్చట్లు:
తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోందని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి రజత్ కుమార్ వెల్లడించారు.  ఓటింగ్ ప్రక్రియ వేగంగా జరుగుతుండడంతో ఓటర్లు కూడా ఉత్సాహంగా ఓటేసేందుకు ముందుకు వస్తున్నారు. ఉదయం 7 గంటల నుండి ప్రారంభం కావాల్సిన పోలింగ్ కాస్త ఆలస్యంగా ప్రారంభమైంది. ఈ సందర్భంగా రజత్ కుమార్ మీడియాతో మాట్లాడారు.
ప్రస్తుతం జరుగుతున్న ఎన్నికల్లో వచ్చిన 30 ఫిర్యాదుల్లో 25 వాటికి సమాధానం చెప్పినట్లు తెలిపారు. ఐదు  ఫిర్యాదులకు సమాధానం చెప్పాల్సినవసరం ఉందన్నారు. కొడంగల్ విషయంలో జరిగిన ఘటనపై డీఈవో దగ్గరి నుండి రిపోర్టు తీసుకోవడం జరిగిందన్నారు. అక్కడి నుండి రెండు ఫిర్యాదులు వస్తే వెంటనే చర్యలు తీసుకున్నట్లు అయన చెప్పారు.
ఆయా ఫిర్యాదులపై డీఈవోలకు సమాచారం ఇచ్చినట్లు వెల్లడించారు.  టోల్ప్లాజా దగ్గర భారీగా ట్రాఫిక్ జాం ఉందని అన్నారు. దాంతో ఈ సాయంత్రం ఐదు గంటలవరకు ఉచితంగానే టోల్ప్లాజా వద్ద అనుమతించాలని కోరామని అన్నారు.
Tags: The polling in Telangana is peaceful

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *