ఘనంగా విగ్రహాల ప్రతిష్ట

– బెల్డోణ స్వామి ఆధ్వర్యంలో విగ్రహాల ప్రతిష్ట
-గాయత్రీదేవి,గణపతి,శ్రీ వల్లి సమేత షణ్ముఖ స్వామి మరియు కాశిరెడ్డి నాయన తదితర విగ్రహాల ప్రతిష్ట
 
గుంతకల్ ముచ్చట్లు:
 
మండల కేంద్రమైన గుంతకల్ లోని కసాపురం రోడ్డు నందు గాయత్రి దేవ్యాలయ ప్రాంగణము నందు ఫిబ్రవరి 9వ తేదీ నుండి 11వ తేదీ వరకు బెల్డోణ స్వామి నిర్ణయించిన శుభముహూర్తం నందు శ్రీ వల్లీ
దేవసేనా సమేత షణ్ముఖ స్వామీ ఆలయ నిర్మాణకర్తలు పారా రామచంద్ర ప్రసాద్,పారా విశ్వనాథ్ ల ఆధ్వర్యంలో అత్యంత వైభవంగా ప్రతిష్ట కార్యక్రమం నిర్వహించబడుతుంది. మొదటగా బుధవారం 9వ
తేదీన శాంతి పాఠం, గోపూజ,గంగ పూజ తదితర పూజలు నిర్వహించి శ్రీ సుబ్రహ్మణ్య లక్ష బస్మార్చనతో కార్యక్రమాన్ని ముగిస్తారు.గురువారం పదవ తేదీన జలాధివాసాంగ హోమం,మూలమంత్ర హోమాలను
నిర్వహించి చివరిగా గాయత్రీ లక్ష కుంకుమార్చన కార్యక్రమంను నిర్వహిస్తారు. చివరి రోజైన శుక్రవారం 11వ తేదీన గణపతి వందనం,దీక్ష హోమం మరియు ప్రతిష్ఠ హోమాలను నిర్వహించి బ్రహ్మ
కలశాభిషేకాలను నిర్వహిస్తారు.చివరిగా శుక్రవారం సాయంత్రం 6 గంటలకు శ్రీ వల్లీ దేవసేన సమేత సుబ్రహ్మణ్య కళ్యాణం మహోత్సవం నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు తెలియజేశారు.వచ్చిన భక్తులకు
ఎటువంటి ఇబ్బందులు లేకుండా ప్రతి రోజూ మధ్యాహ్నం భోజన కార్యక్రమాలను ఏర్పాటు చేశారు.మైసూరు దత్త పీఠం నుండి డాక్టర్ వంశీకృష్ణ వారి నేతృత్వంలో మూడు రోజుల ప్రతిష్ట కార్యక్రమాన్ని
నిర్వహిస్తున్నారు.ఈ ప్రతిష్టా కార్యక్రమము నందు అవధూత శ్రీ కాశిరెడ్డి నాయన విగ్రహ ప్రతిష్టను కూడా నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు తెలియజేశారు. మూడు రోజుల పాటు ఘనంగా నిర్వహించే ప్రతిష్ఠా
మహోత్సవ కార్యక్రమాలను భక్తులందరూ హాజరు విజయవంతం చేయాలని పారా రామచంద్ర ప్రసాద్ మరియు పారా విశ్వనాధ్ లు తెలియజేశారు.
 
Tags: The prestige of the glorious idols

Natyam ad