ప్రధాని దిష్టిబొమ్మ దగ్దం
దేవరకొండ ముచ్చట్లు:
నల్గొండ జిల్లా దేవరకొండ నియోజకవర్గంలో అన్ని మండలాల్లో టిఆర్ఎస్ నాయకులు దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దిష్టిబొమ్మ దగ్ధం చేశారు. తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి చెందుతుంటే ఓర్వలేని ప్రధానమంత్రి అనుచిత వాక్యాలు చేయడం విడ్డురమన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక తెలంగాణ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి పథకాలు దేశానికే ఆదర్శమన్నారు. మరో సారి తెలంగాణపై ఎలాంటి అనుచిత వ్యాఖ్యలు చేసిన రాష్ట్ర ప్రజలు మోదీని తరిమి కొట్టడం ఖాయమని హెచ్చరించారు
Tags; The Prime Minister burns the effigy