The Pudda River,

ఉగ్రరూపం దాల్చిన బహుదా నది

Date:12/10/2018
శ్రీకాకుళం  ముచ్చట్లు:
తిత్లీ తుఫాన్ ప్రభావంతో శ్రీకాకుళం ఒరిస్సాలో పడుతున్న భారీ వర్షాలకు బహుదా నదిలో వరద నీరు పోటెత్తింది. భారీగా వరద నీరు చేరడంతో పలు గ్రామాలునీట మునిగాయి.  బహుదానది ఉగ్రరూపం దాల్చడంతో బిర్లంగి తోటూరు, మశాఖపురం,ఈదుపురం,ఇనీసుపేట,తులసిగామ్, కొఠారి,పూర్ణాటకం జగన్నాధపురం శాసనం తో పాటు దాదాపు 30 గ్రామాలకు బాహ్య ప్రపంచంతో సంబంధాలు తెగిపోయాయి. మరోవైపు బిర్లంగి తోటూరు ఎంపీటీసీ ప్రతినిధి జోగుల దిలీప్ పై గురువారం ఆర్ధ రాత్రి అడవి పంది దాడి చేసింది. తీవ్ర రక్తస్రావం అయినా దిలీప్ ఆసుపత్రి తరలించడానికి వీలు లేకపోవడంతో పరిస్థితి విషమంగా ఉంది.
ఎన్డీఆర్ఎఫ్ బృందాలు వచ్చినప్పటికీ వారి దగ్గర ఇటువంటి బోట్లు లేకపోవడంతో బిర్లాంగి తోటూరు చేరుకోవడం ఇబ్బందిగా మారింది. తుఫాన్ ప్రభావంతో ఇంకా వర్షాలు తగ్గుముఖం పట్టకపోవడం రెండు రోజులుగా నీటిలోనే ఉండడం ఇప్పటివరకు వరద తగ్గిపోవడంతో ఏం జరుగుతుంది అని బిక్కుబిక్కుమంటూ సహాయం కోసం ఎదురుచూస్తున్నారు.బహుధానది అరకబద్ర వద్ద గండి పడిందని స్థానికులు చెబుతున్నారు.ఇసుక మాఫియా వాళ్ళు నది గట్టుకుడా ఇసుక కోసం తవ్వడం వలనే గ్రామాల్లోకి నీరు చేరిందని పరిస్థితి ఇవిధంగానే కొనసాగితే బారి ఆస్తి నష్టంతో పాటు ప్రాణనష్టం జగిగే  అవకాశం ఉంది.
Tags:The Pudda River,

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *