పుంగనూరు బైపాస్‌ రోడ్డు అత్యంత సుందరంగా ఏర్పాటు

పుంగనూరు ముచ్చట్లు:
 
పట్టణంలోని కోర్టు బైపాస్‌రోడ్డును అత్యంత సుందరంగా 60 అడుగుల వెడల్పుతో ఏర్పాటు చేస్తున్నట్లు చైర్మన్‌ అలీమ్‌బాషా, ఎంపీపీ అక్కిసాని భాస్కర్‌రెడ్డి తెలిపారు. శనివారం మంత్రి పిఏ మునితుకారం, ఏఎంసీ చైర్మన్‌ నాగరాజారెడ్డి తో కలసి బైపాస్‌రోడ్డు పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా భాస్కర్‌రెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర మంత్రి డాక్టర్‌ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆదేశాల మేరకు రోడ్డు పనులు పూర్తికావస్తోందన్నారు. ముఖ్యంగా తాటిమాకులపాళ్యెం వద్ద గల కళాశాల ప్రహారీను తొలగించడం, అలాగే సాయిబాబా గుడి, దర్గా వద్ద మరో 10 అడుగులు రోడ్డును విస్తరించి, రాకపోకలకు అనువుగా మలుపులను మార్చుతున్నట్లు తెలిపారు. రోడ్డు మధ్యన రెండు అడుగుల డివైడర్లు ఏర్పాటు చేసి, పూల వెహోక్కలతో పాటు ఎల్‌ఈడి దీపాలు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. సుమారు 30 సంవత్సరాలుగా అభివృద్ధికి నోచుకోని బైపాస్‌రోడ్డుతో పట్టణానికి మహార్ధశ వచ్చిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్‌ అమ్ము, వైఎస్సార్‌సీపీ నాయకులు రాజశేఖర్‌రెడ్డి, చంద్రారెడ్డి యాదవ్‌ తదితరులు పాల్గొన్నారు.
 
Tags; The Punganur Bypass Road is beautifully laid out

Natyam ad