The purpose of the publication is

ప్రజాసంక్షేమమే తెదేపా ధ్యేయం

Date:09/01/2018

పెద్దపంజాణి ముచ్చట్లు:

రాష్ట్రంలో ప్రజల అభివృద్ధి, సంక్షేమమే ధ్యేయంగా తెదెపా ప్రభుత్వం పనిచేస్తోందని ఎంపీపీ మురళీకృష్ణ అన్నారు. పెదకాప్పల్లి, రాయలపేట గ్రామ పంచాయితీల్లో ఆయా సర్పంచుల ఆద్వర్యంలో జరిగిన 5 వ విడత జన్మభూమి – మా ఊరు కార్యక్రమంలో ఎంపీపీ మురళీకృష్ణ, జెడ్పీటీసీ సులోచన పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రజలు తమ ఇబ్బందులను నేరుగా నాయకుల, ప్రభుత్వ అధికారుల దృష్టికి తీసుకు రావడానికే జన్మభూమి తరహాలో గ్రామ సభలు నిర్వహిస్తున్నామని తెలిపారు. సీఎం రిలీఫ్ ఫండ్, చంద్రన్న భీమా, సామాజిక పింఛనులు వంటి సంక్షేమ పథకాలతో పేదలకు ఎంతో లబ్ధి చేకూరుతోందన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాష్ట్ర అభివృద్ది కోసం నిర్విరామంగా కష్టపడుతున్నారని పేర్కొన్నారు. అనంతరం ప్రజలనుండి పింఛనులు, రేషన్ కార్డులు, గృహనిర్మాణాలకోసం అర్జీలు స్వీకరించారు. పెనుగొలకల గ్రామంలో ఏర్పాటు చేసిన కూరగాయల స్టాల్స్ ను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో తహశీల్దారు సురేంద్ర బాబు, ఎంపీడీఓ వెంకటరత్నం, వివిద శాఖల అధికారులు, ఎంపీటీసిలు, నాయకులు రోజాక్రిష్ణారెడ్డి, మండల తెదేపా అధ్యక్షుడు శ్రీరాములు, రామక్రిష్ణ, అంగన్‌వాడీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Tags : The purpose of the publication is

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *