కుడి కన్నుకు ఎట్లా గాయం : రేవంత్ రెడ్డి

Date:13/03/2018
హైదరాబాద్ ముచ్చట్లు:
మయాసభలో దుర్యోధనుడి  ఏకపాత్రాభినయం లా కనిపించింది. తన తప్పిదాలు కప్పిపెట్టుకోవడానికి సభ్యుల హక్కులు కాలరాస్తూ ఉద్వేషాన్ని కక్కిండని కాంగ్రెస్ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి ఆరోపించారు. తెలంగాణ రాష్ట్ర శాసనసభలో మార్షల్ పెట్టి రెచ్చగొట్టే విధంగా వ్యవహరించారని అయన  అన్నారు. మంగళవారం శాసనసభ మీడియా పాయింట్ వద్ద ఆయన మీడియాతో మాట్లాడారు. సోమవారం నాడు జరిగిన ఘటన చెదురుముదురు ఘటనలని అభివర్ణించారు. ఈ ఘటనపై గవర్నర్ చర్యలు తీసుకోవాలని కోరారు.  స్పీకర్ గారి పరిధిలో లేని విషయం అది… గవర్నరే నిర్ణయం  తీసుకోవాలని అన్నారు. లేని అధికారాలు  తీసుకొని సభ్యులను సస్పెండ్ చేయాలన్నా రద్దు చేయాలన్నా అనేక పద్దతులుంటాయని అయన అన్నారు. వాదనలు విన్నతరువాతనే స్పీకర్ జడ్జ్ మెంట్ ఇవ్వాలి. శాసనసభా వ్యవహారాల మంత్రి తీర్మానం  చేస్తే సస్పెండ్ చేసే  అవకాశం ఉండదని అయనవివరించారు. దేశంలో ఎక్కడా ఇలాంటి ఘటన జరిగి ఉండదు. సమస్యలు లేవనెత్తకుండా సస్పెండ్ చేయడం, సభ్యత్వాన్ని రద్దు చేయడం చెల్లదని అయనఅన్నారు. ఉరిశిక్ష వేసిన వారికూడా చివరికోరిక అడుగుతారు. సభలో చర్యలు తీసుకోవాలంటే అన్ని పార్టీల ఆమోదం తీసుకోవాలి. ప్రభుత్వం ఏకపక్షంగా వ్యవహరించడం తగదని రేవంత్ అన్నారు. ప్రతిపక్ష నేతలు కూడా అర్దం చేసుకోవాలి. ఇదే పరిస్థితిఅన్ని పార్టీలకు రావచ్చు. దీన్ని తీవ్రంగా పరిగణిస్తున్నాం. అన్నిస్థాయిల్లో పోరాటం చేసేందుకు సాద్దమవుతున్నామని అన్నారు. సమస్యలపై పోరాడుతుంటే మాపై చర్యలు తీసుకోవడం పద్దతి కాదని సూచించారు. కుడికన్నుకు దెబ్బ ఎలా తగులుతుంది. ఎడమవైపు ప్రతిపక్షాలు ఉన్నారు. ఇదంతా పాలకపక్షం అడుతున్న నాటకమని రేవంత్ అన్నారు. పాలకపక్ష సభ్యులే హెడ్ ఫోన్ విసిరారేమో అన్న అనుమానం కలుగుతుందని అయనఅన్నారు. ఆరు  కెమెరాల ఫూటేజీ అందరికీ అందుబాటులోకితేవాలి.  నాలుగువేలకు పైగా రైతులు ఆత్మహత్యలు చేసుకుంటే రైతులు … రైతాంగం బాగుందని చెప్పడానికి సిగ్గుండాలని అయన విమర్శించారు.
Tags: The right eye injury: Revant Reddy

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *