రింగ్‌ ఎక్కడైన వేయగలం…

చౌడేపల్లె ముచ్చట్లు :

రాజకీయచదరంగంలోనైనా , క్రీడారంగంలోనైనా తమదైన శైలిలో రింగ్‌ వేయగలం అన్నధీమాతో పెద్దిరెడ్డి ద్వారకనాథరెడ్డి క్రీడాపోటీలను ప్రారంభించారు. తంబళ్లపల్లె వైఎస్సాఆర్సీపి కన్వీనర్‌ పెద్దిరెడ్డి ద్వారకనాథరెడ్డి జోనల్‌ క్రీడలను చౌడేపల్లెలో ప్రారంభించి, ప్రసంగించారు. ఐదు మండలాలకు చెందిన క్రీడా పోటీలు రెండు రోజుల పాటు జరగనున్నాయి. ఈ క్రీడలనుద్ధేశించి ద్వారకనాథరెడ్డి మాట్లాడుతూ విద్యార్థులకు క్రీడలు ఎంతో అవసరమన్నారు. ప్రస్తుతం వ్యాయమంలేక విద్యార్థులు ఆనారోగ్యానికి గురౌతున్నారని తెలిపారు. ప్రతి ఒక్కరు యోగాసనాలు, క్రీడల్లో పాల్గొనాలన్నారు. ఈకార్యక్రమంలో ఎంపిపి అంజిబాబు, జెడ్పిటిసి రుక్ష్మిణమ్మ, ఎంఈవో కేశవరెడ్డి, వైఎస్సాఆర్సీపి నాయకులు రెడ్డిప్రకాష్‌, గాజుల రామ్మూర్తి, రవిచంద్రారెడ్డి, సుధాకర్‌రెడ్డి, క్రిష్ణారెడ్డి, నాగభూషణంరెడ్డి, యువజన సంఘ నాయకుడు మిద్దింటి కిషోర్‌, సింగిల్‌విండో అధ్యక్షుడు మునస్వామిరాజు, హెచ్‌ఎం ఈశ్వర్‌రెడ్డి, పిఈటి రామచంద్రతో పాటు ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.