The ringagrand that is concerned in Warangal district residents

వరంగల్‌ జిల్లా వాసుల్లో ఆందోళన కలిగిస్తున్న రింగురోడ్డు

Date: 03/01/2018

వరంగల్‌ ముచ్చట్లు:

తెలంగాణలో హైదరాబాద్‌ తరువాత వరంగల్‌కు సీఎం కేసీఆర్‌ అత్యంత ప్రాధాన్యతనిస్తున్నారు. ఈ ప్రాంత అభివృద్ధిలో భాగంగా రింగ్‌ రోడ్డు నిర్మాణం చేయాలని కేసీఆర్‌ సర్కార్‌ భావించారు. వరంగల్‌ నుండి హైదరాబాద్‌ వెళ్లే రోడ్డు సరిగ్గా లేకపోవడంతో రింగ్‌ రోడ్డు ప్రతిపాదన చేశారు. దీనితో ఆ జిల్లా వాసులు ఎంతో ఆనందం వ్యక్తం చేశారు. కానీ గత కొన్ని రోజుల నుండి రూట్లలలో మార్పులు చోటు చేసుకుంటుండడంతో అదే జిల్లా వాసులు ప్రస్తుతం ఆందోళన చెందుతున్నారు. మడికొండ నుండి హసన్‌పర్తి, బీమారంల మీదుగా ఆరేపల్లి గ్రామాన్ని కలుపుతూ ములుగు రోడ్డు వరకు ఔటర్‌రోడ్డు రాంపూర్‌ నుండి ఖాజీపేట, కడిపికొండల మీదుగా ఖమ్మం, నర్సంపేట హైవేను కలుపుతూ మొత్తం 70 కిలోమీటర్లు రింగ్‌రోడ్డును నిర్మించాలని మాస్టర్‌ ప్లాన్‌ రూపొందించారు. దీంతో నగరవాసులు ఎంతో సంతోషించారు. రింగ్‌రోడ్డుపై సర్వే కూడా చేశారు. బీమా రంగంలోని సహకార భవనం, తులసి గార్డెన్‌ను ఆనుకుంటూ ఔటర్‌ రోడ్డు వెళ్తుందని మార్కింగ్‌ చేశారు. కానీ కొంతమంది బడాబాబులు, రియల్టర్ల హవాతో అక్కడ రహదారి రూట్‌ను మార్చారు. దీంతో ప్రజలు పెద్ద ఎత్తున ఆందోళనలు చేపట్టారు. దీంతో అధికారులు ఆ ఆలోచనను విరమించుకున్నారు. అంతేగాక మరికొన్ని చోట్ల అలైన్‌మెంట్‌లో మార్పులు చేయడంపై బీమారం, చింతగట్టు, దేవన్నపేట గ్రామాల ప్రజలు ఆందోళనలు నిర్వహించారు. తాజాగా ఔటర్‌ రింగ్‌రోడ్డుపై సీఎం కేసీఆర్‌ సమీక్ష నిర్వహించనున్నారని టీఆర్‌ఎస్‌ నేతలు చెబుతున్నారు. అయితే నగరవాసులు మాత్రం గతంలో సర్వే చేసి రూపొందించిన మాస్టర్‌ ప్లాన్‌ ప్రకారం ఔటర్‌రింగ్‌ రోడ్డు నిర్మించాలని కోరుతున్నారు. ఔటర్‌ రింగ్‌రోడ్డు ప్రస్తావన వచ్చిన ప్రతిసారి రియల్టర్లు తమ హవాతో రూట్‌ మార్చారని పలువురు ఆరోపిస్తున్నారు. గతంలో జరిగిన అవకతవకలను సవరించి ప్రజల ప్రయోజనాలు కాపాడే విధంగా తెలంగాణ సర్కార్‌ ఔటర్‌ రింగ్‌రోడ్డు నిర్మించాలని పలువురు కోరుతున్నారు.

Tags: The ringagrand that is concerned in Warangal district residents

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *