The risk of crash: 100 meters

ఘోర ప్రమాదం: 100 మీటర్లు ఈడ్చుకెళ్లింది

సాక్షి

Date :08/01/2018

ముంబై : అతి వేగంతో వస్తున్న ఓ మోటార్‌ సైకిల్‌ 19 ఏళ్ల గిరిజ అంబాలాను ఢీ కొట్టింది. ప్రమాదంలో బండి చక్రాల మధ్య గిరిజ టీ షర్ట్‌ ఇరుక్కుపోయింది. దీంతో బైక్‌ ఆమెను 100 మీటర్ల పాటు ఈడ్చుకెళ్లింది. ఈ ఘటనలో తలకు బలమైన గాయాలై ఆమె ప్రాణాలు కోల్పోయారు.

స్నేహితుడు కునాల్‌ సురేంద్ర వైద్య(21)తో కలసి వొర్లీ సీ ఫేస్‌కు గిరిజ వెళ్లారు. రాత్రి తొమ్మిదిన్నర గంటల ప్రాంతంలో కునాల్‌తో కలసి రోడ్డు దాటుతున్న ఆమెను ముగ్గురితో అతి వేగంగా వస్తున్న బైక్‌ ఢీ కొట్టింది. ఈ ఘటనలో బైక్‌పై ఉన్న ఓ వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి.

గిరిజను బండి ఈడ్చుకెళ్లడంతో ఆమె తల డివైడర్‌కు పలుమార్లు తగిలింది. దీంతో ఆమె తలకు తీవ్ర గాయాలయ్యాయి. ప్రమాదంలో గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ ఆదివారం గిరిజ కన్నుమూశారు. ఘోర రోడ్డు ప్రమాదంపై మాట్లాడిన ఆమె తండ్రి.. వాహనాలు నడిపేప్పుడూ జాగ్రత్తగా ఉండాలని కోరారు. తన కూతురి మరణానికి కారణమైన వారిపై చట్ట పరంగా చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు.

అవయవాలు పనికి రావన్నారు..
బ్రెయిన్‌ డెడ్‌తో మరణించిన గిరిజ అవయవాలను దానం చేసేందుకు ఆమె తల్లిదండ్రులు ముందుకు వచ్చారు. అయితే, ఎక్కువ రక్తం పోవడం వల్ల ఆమె అవయవాలను తీసుకోలేమని డాక్టర్లు పేర్కొన్నారు. రోడ్డు ప్రమాదంపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు.

Tags : The risk of crash: 100 meters

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *