జూబ్లీహిల్స్‌లో ఘోర రోడ్డు ప్రమాదం

Date: 13/01/2018

హైదరాబాద్‌ ముచ్చట్లు:

హైదరాబాద్‌ జూబ్లీహిల్స్ లోని ప్రశాసన్‌నగర్‌లో తెల్లవారుజామున ఘోర రోడ్డుప్రమాదం జరిగింది. మద్యం మత్తులో డ్రైవ్ చేసి కారును చెట్టుకు బలంగా ఢీకొట్టారు. ఈ ఘటనలో విశ్వజిత్‌ అనే యువకుడు అక్కడికక్కడే మృతి చెందాడు. మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రుల్ని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. మద్యంమత్తులో కారు నడిపడమే ఈ దుర్ఘటనకు కారణమని పోలీసుల వెల్లడించారు. ఇదిలాఉండగా, రాత్రి హైదరాబాద్‌ జూబ్లీహిల్స్‌లో డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌ తనిఖీలు నిర్వహించగా, మద్యం తాగి వాహనం నడిపిన 37 మందిపై కేసులు నమోదయ్యాయి. 25 కార్లు, 12 బైక్‌లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

Tags: The road accident at Jubilee Hills

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *