బిందాస్ గా అధికార పార్టీ

 Date:19/07/2018
న్యూఢిల్లీ  ముచ్చట్లు:
కేంద్రంలోని ఎన్డీయే ప్రభుత్వంపై తెలుగుదేశం పార్టీ ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానంపై శుక్రవారం లోక్‌సభలో చర్చ జరగనుంది. చర్చ తర్వాత ఓటింగ్ కూడా నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో సభలో ఏ పార్టీ ఎవరి వైపు అన్నదానిపై ఇంకా సస్పెన్స్ కొనసాగుతున్నది. దీనిపై టీఆర్‌ఎస్ స్టాండ్ ఏంటన్నదానిపై పార్టీ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయం తీసుకోనున్నారు. చర్చలో పాల్గొంటామని, తెలంగాణకు కేంద్రం నుంచి రావాల్సిన నిధులు, ఇతర విభజన హామీలపై మాట్లాడతామని లోక్‌సభలో టీఆర్‌ఎస్ పక్ష నేత ఏపీ జితేందర్‌రెడ్డి ఇప్పటికే స్పష్టంచేశారు. అవిశ్వాసానికి మద్దతివ్వాల్సిందిగా టీడీపీ తమను కోరినట్లు కూడా ఆయన తెలిపారు.ఇక అటు అవిశ్వాసాన్ని గట్టెక్కడానికి బీజేపీ ప్రయత్నాలు మొదలుపెట్టింది. ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా.. శివసేన చీఫ్ ఉద్ధవ్ థాక్రేకు ఫోన్ చేసి ప్రభుత్వానికి మద్దతివ్వాల్సిందిగా కోరారు. దీనికి ఉద్ధవ్ కూడా అంగీకరించడం విశేషం. కొద్ది రోజులుగా బీజేపీ, శివసేన మధ్య సంబంధాలు అంత బాగా లేకపోయినా.. ప్రభుత్వానికి మద్దతివ్వడానికి శివసేన ముందుకొచ్చింది. ఈ మేరకు తమ పార్టీ ఎంపీలదరికీ ప్రభుత్వానికి మద్దతుగా ఓటేయాలని విప్ జారీ చేసింది. అటు తమిళనాడుకు చెందిన అధికార పార్టీ అన్నాడీఎంకే మాత్రం తాము అవిశ్వాస తీర్మానానికి మద్దతు ఇవ్వబోమన్న హింట్ ఇచ్చింది. గత సమావేశాల్లో రాష్ర్టానికి చెందిన కావేరీ అంశాన్ని లేవనెత్తి ఎన్ని రోజులు ఆందోళన చేసినా ఏ రాష్ట్రం తమకు మద్దతుగా రాలేదన్న విషయాన్ని తమిళనాడు సీఎం పళనిస్వామి గుర్తుచేశారు. అవిశ్వాస తీర్మానం అన్నది టీడీపీ లేవనెత్తినది అని, దీంతో తమకు సంబంధం లేదని ఆయన తేల్చి చెప్పారు. ఓటింగ్‌కు అన్నాడీఎంకే దూరంగా ఉంటే అవకాశాలు కనిపిస్తున్నాయి. అటు ఒడిశా అధికార పార్టీ బిజు జనతాదళ్ కూడా అవిశ్వాస తీర్మాన ఓటింగ్‌కు హాజరు కాకూడదని నిర్ణయించింది.ఈ లెక్కన అవిశ్వాస తీర్మానం నోటీసు ఇచ్చిన టీడీపీతోపాటు కాంగ్రెస్, సీపీఐ, సీపీఎం, ఎన్సీపీ, ఎస్పీ సభ్యులు అవిశ్వాసానికి మద్దతిస్తున్నారు. అయితే ఈ గండాన్ని మోదీ సర్కార్ ఈజీగానే గట్టెక్కాలా కనిపిస్తున్నది. ప్రస్తుతం లోక్‌సభలో మొత్తం సభ్యుల సంఖ్య 533కి పడిపోయింది. వైఎస్సార్సీపీ ఎంపీలు రాజీనామా చేయడంతోపాటు బీజేడీ ఎంపీ బైజయంత్ రాజీనామాను లోక్‌సభ స్పీకర్ సుమిత్ర ఆమోదించారు. అటు కేరళ కాంగ్రెస్ (ఎం) సభ్యుడు కే మణి రాజ్యసభకు నామినేట్ అయ్యారు. ఈ లెక్కన సభలో 266 సభ్యుల మద్దతు ఉంటే బీజేపీ గట్టెక్కుతుంది. కేవలం బీజేపీకే 274 మంది సభ్యుల బలం ఉంది. 18 మంది సభ్యులున్న శివసేన కూడా మద్దతిస్తుండటంతో ఇక బీజేపీకి ఏ ఆందోళన లేదు. మొత్తంగా ఎన్డీయే సభ్యుల సంఖ్య 314గా ఉంది. శుక్రవారం ఉదయం 11 గంటలకు అవిశ్వాస తీర్మానంపై చర్చ జరుగుతుంది. సాయంత్రం 6 గంటల వరకు చర్చ, ఓటింగ్ ప్రక్రియ పూర్తవుతుంది.
బిందాస్ గా అధికార పార్టీ http://www.telugumuchatlu.com/the-ruling-party-as-bindas/
Tags:The ruling party as Bindas

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *