The secret deal to the BJP, Jagan: Deputy Chief Minister Chinnarajappa

బీజేపీ, జగన్ కు రహస్య ఒప్పందం : ఉప ముఖ్యమంత్రి  చినరాజప్ప

Date:19/02/2018
అమరావతిముచ్చట్లు:
ప్రతిపక్ష నేత వైఎస్  జగన్ ఎప్పుడూ బీజేపీని విమర్శించరని హోంమంత్రి చినరాజప్ప అన్నారు. అలాగే బీజేపీ నేతలు కూడా జగన్ను విమర్శించరని ఆయన చెప్పారు. వారి మధ్య అవగాహన ఉందనే అనుమానం మాకుందని అయన అన్నారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడారు. బీజేపీ, జగన్ మధ్య రహస్య ఒప్పందం ఉందేమోనని అనుమానం వస్తుందన్నారు. అవిశ్వాసం అంటే కూడా బీజేపీ నేతలు ఎందుకు మాట్లాడటం లేదని ఆయన ప్రశ్నించారు. బీజేపీ మంత్రుల రాజీనామాలు వారి ఇష్టమన్నారు. మేం ఇప్పటికీ మిత్రధర్మాన్ని పాటిస్తున్నామని చినరాజప్ప పేర్కొన్నారు. ఏపీ బీజేపీ నేతలు వాస్తవ పరిస్థితిని కేంద్రానికి తెలపాలని వ్యాఖ్యానించారు. రాష్ట్ర ప్రయోజనాలకోసం అవిశ్వాసానికి మద్దతునిస్తాం,కానీ భేదిరించడానికి కాదని అన్నారు. జగన్ మాట మీద నిలబడి వ్యక్తి కాదని అన్నారు. రాష్ట్రాభివృద్ధి కోసం ఇప్పటికే కేంద్ర పెద్దలతో ముఖ్యమంత్రి చర్చలు జరిపారు. రాష్ట్రానికి అన్ని రాష్ట్రాలకు ఇచ్చినట్లే ఏపీ కి ఇచ్చారని బాధ ముఖ్యమంత్రి కి ఉందని అయన వ్యాఖ్యానించారు. రాష్ట్రానికి నిధులు రాకపోతే కేంద్ర క్యాబినెట్ నుంచి తప్పుకుంటామని ముఖ్యమంత్రి చెప్పారు.  రాష్ట్రానికి ఇచ్చిన హామీలను అమలు చేయాలని కోరుతున్నామని అన్నారు.
Tags: The secret deal to the BJP, Jagan: Deputy Chief Minister Chinnarajappa

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *